translateexpand_more

Telangana Latest News Live News

Latest updates from Telugu Digital news sources.

Zee Telugu02 Jun, 02:05 am
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి పుష్కరం పూర్తి.. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలు లైవ్ అప్ డేట్స్

Telangana Formation Day: ఎన్నో దశాబ్దాల పోరాటం తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అనే కల సాకారమైంది. సరిగ్గా 2014 జూన్ 2వ తేదిన ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావం కోసం ఎంతో మంది త్యాగాలు చేశారు. వారి త్యాగాల పునాదులపై ఏర్పడిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వెనక పెద్ద చరిత్రే ఉంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చినా.. తెలంగాణ ప్రాంత వాసులకు స్వాతంత్య్రం సిద్ధించలేదు. బ్రిటిష్ వారు భారత దేశానికి స్వాతంత్య్రం ఇస్తూ ఇక్కడున్న స్వదేశీ సంస్థానాధీశులు వారు ఇష్ట ప్రకారం భారత దేశంతో కలిసి ఉండటమా.. లేకపోతే పాకిస్థాన్ లో కలవాలనేది వారి ఇష్ట ప్రకారానికే ఒదిలేసారు. ఇక అప్పటి ఉప ప్రధాని హోం మంత్రి సర్ధార్ వల్లభభాయ్ పటేల్ చొరవతో దేశంలోని అన్ని సంస్థానాలు మన దేశంలో విలీనమయ్యాయి. కానీ జమ్మూ కాశ్మీర్, జునాఘడ్, హైదరాబాద్ సంస్థనాలు మాత్రం మన దేశంలో విలీనం కాలేదు. హైదరాబాద్ ను అపుడు పరిపాలిస్తున్న 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్.. హైదరాబాద్ సంస్థానాన్న పాకిస్థాన్ లో కలపాలనే కుట్రకు తెర తీసారు. అప్పటి హైదరాబాద్ సంస్థానంలో తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటకలో పలు జిల్లాలండేవి. అప్పట్లో ఇక్కడ మెజారిటీ ప్రజలైన హిందువులైన ఖాసీం రజ్వీ నేతృత్వంలోని రజాకార్ అనే ప్రైవేట్ సైన్యం అనేక దారుణ మారణ కాండాలు నిర్వహించింది. 2014లో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో తొలి సీఎం గా కేసీఆర్ బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత రెండో ముఖ్యమంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి అయ్యారు. ప్రస్తుతం ఆయన నేతృత్వంలో పరేడ్ గ్రౌండ్స్‌లో పెద్ద ఎత్తున తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.