translateexpand_more

Up Viral News News

Latest updates from Telugu Digital news sources.

Andhra Jyothy02 Jun, 10:07 am
చెట్టుపై నుంచి నోట్ల వర్షం కురిపించిన కోతి.. వీడియో వైరల్

ఇంటర్నెట్ డెస్క్: ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లా కోర్టు ప్రాంగణంలో ఒక వింత ఘటన చోటుచేసుకుంది. కోర్టు పనిమీద వచ్చిన రవీంద్ర అనే వ్యక్తి చేతిలోని బ్యాగును లాక్కున్న కోతి సమీపంలోని చెట్టెక్కింది. అందులోని రూ.2 లక్షల నగదును చెట్టుపై నుంచి గాల్లోకి విసిరేస్తూ నోట్ల వర్షం కురిపించింది. ఈ ఊహించని పరిణామంతో కాసేపు కోర్టు ఆవరణ అంతా కోలాహలం నెలకొనగా, దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌గా మారుతోంది.

బ్యాగులో తినే వస్తువులు ఏవైనా ఉన్నాయేమోననే ఆశతో కోతి బ్యాగును మొత్తం చింపేసింది. అయితే అందులో తినే పదార్ధాలకు బదులు నోట్ల కట్టలు కనిపించడంతో.. ఆ కోతి ఒక్కో నోట్ల కట్టను తీసుకుని గాల్లోకి విసిరేయడం ప్రారంభించింది. దీంతో చెట్టు పైనుంచి ఒక్కసారిగా కరెన్సీ నోట్ల వర్షం కురిసినట్లయింది. గాల్లో తేలుతూ కిందపడుతున్న నోట్లను చూసి కోర్టు ప్రాంగణమంతా కాసేపు తీవ్ర కోలాహలం నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. స్థానికుల సాయంతో చెట్టు కింద పడిన నోట్లన్నింటినీ జాగ్రత్తగా సేకరించి.. ఆ డబ్బును దాని యజమాని రవీంద్రకు తిరిగి ఇచ్చేశారు. అదృష్టవశాత్తూ డబ్బులన్నీ తిరిగి దొరకడంతో బాధితుడికి ఎలాంటి ఆర్థిక నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. కాగా, కోతి చేసిన ఈ హడావుడికి సంబంధించిన దృశ్యాలను కొందరు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ALso Read:

సీబీఎస్‌ఈ చీఫ్‌కు పార్లమెంటరీ ప్యానెల్ సమన్లు..

టీఎంసీ రెబల్స్ కొత్త పార్టీ.. తెరపైకి ‘అస్లీ తృణమూల్’..

Up Viral News News Keyword | Telugu Digital