
జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Summer Holidays 2026: తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులకు కీలక అప్డేట్ వచ్చింది. అటు ఆంధ్రప్రదేశ్.. ఇటు తెలంగాణలోని విద్యాసంస్థలకు వేసవి సెలవులు తుదిదశకు చేరుకున్న ఇప్పుడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి సెలవులను మే 31 నాటికి పూర్తి చేసి, జూన్ మొదటి వారం నుంచి కాలేజీలు తిరిగి తెరుచుకోనున్నాయి. ఈ మేరకు ఇరు రాష్ట్రాల విద్యాశాఖలు ఉత్తర్వులతో పాటు కొత్త అకడమిక్ క్యాలెండర్లను విడుదల చేశాయి. జూన్ 1 నుంచే ఇంటర్ క్లాసులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కాలేజీలు జూన్ 1వ తేదీ నుంచి పునఃప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 24న ప్రారంభమైన ఇంటర్ వేసవి సెలవులు మే 31తో ముగియనున్నాయి. జూన్ 1 నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థులకు క్లాసులు ప్రారంభం అవుతాయి. ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లోనూ ఇంటర్ అడ్మిషన్ల ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2026-27 విద్యా సంవత్సరానికి గానూ మొత్తంగా 232 రోజుల పాటు అకాడమిక్ క్యాలెండర్‌ను రాష్ట్ర విద్యాశాఖ విడుదల చేసింది. ఇందులో భాగంగా ఇంటర్‌లోని NCERT, CBSE సిలబస్‌ను అమలు చేస్తున్నారు. ఇందులో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఏపీలో గత విద్యాసంవత్సరం (2025-26) నుంచే ఇంటర్లో NCERT సిలబస్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఆ దిశగానే ఈ ఏడాది అకడమిక్ క్యాలెండర్‌ను రూపొందించారు. అదే విధంగా తెలంగాణలో 2026-27 విద్యాసంవత్సరంలో 224 పనిదినాలతో మార్చి 30నే అకాడమిక్ క్యాలెండర్ ను విడుదల పూర్తి చేశారు. స్కూళ్లు జూన్ 12 నుంచే.. ఇంటర్ విద్యార్థులకు జూన్ 1 నుంచే కాలేజీలు ప్రారంభం అవుతున్నప్పటికీ, పాఠశాల విద్యార్థులకు మాత్రం మరికొద్ది రోజులు సెలవులు కొనసాగనున్నాయి. స్కూల్ పిల్లలకు జూన్ 11వ తేదీ వరకు వేసవి సెలవులు ఉంటాయి. జూన్ 12వ తేదీ నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు అన్నీ తిరిగి తెరుచుకోనున్నాయి. కాబట్టి, సుదీర్ఘ సెలవుల అనంతరం విద్యార్థులు జూన్ 12 నుంచి తిరిగి బడిబాట పట్టనున్నారు. విద్యార్థులు ఈ షెడ్యూల్ ప్రకారం తరగతులకు హాజరుకావాలని అధికారులు సూచించారు. Also Read: మందుబాబులకు మత్తు దిగిపోయే వార్త..భారీగా పెరగనున్న మద్యం ధరలు..ఎంత పెరుగుతుందంటే? Also Read: వడదెబ్బతో రాష్ట్రంలో 34 మంది మృతి..ఒక్కొక్కరికి రూ.4 లక్షలు ప్రకటించిన ప్రభుత్వం! స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Summary status: pending