
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Tmc mp kalyan Banerjee attacked by mob in Hooghly Kolkata: వెస్ట్ బెంగాల్ రాజకీయాలు దేశంలో హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పటికే ఒకవైపు మమత మేనల్లుడిపై సోరాన్ పూర్ లో గుడ్లు, రాళ్లతో దాడ ఘటనతో పశ్చిమ బెంగాల్ లో ఉద్రిక్తత కొనసాగుతుంది. మరోవైపు దీనిపై మమతా బెనర్జీ బీజేపీ ప్రభుత్వంపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. అంతే కాకుండా ఈ ప్రతీకార రాజకీయాలు మానుకొవాలన్నారు. ఇలాంటి దాడులు తమ ఆత్మస్థైర్యంను నీరుగార్చలేవన్నారు. ఇక అభిషేక్ బెనర్జీని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసిన బెల్ వ్యూ ఆస్పత్రి సీఈవోపై మమతా ఫైర్ అయినట్లు ఒక ఆడియో క్లిప్ వైరల్ గా మారింది. తన మేనల్లుడు క్రికెట్ హెల్మెట్ పెట్టుకొకుంటే తలపగిలి చనిపోయి ఉండేవాడని మమతా ఆవేదన వ్యక్తం చేశారు. తనకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫోన్ చేశారని, అవసరం అయితే అభిషేక్ బెనర్జీని హైదరాబాద్ తరలించి మెరుగైన వైద్యం అందించేందుకు తాము రెడీగా ఉన్నట్లు చెప్పారన్నారు. అభిషేక్ బెనర్జీకి ఏమైన జరిగితే దానికి బీజేపీ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలన్నారు. మరోవైపు అభిషేక్ బెనర్జీ సైతం ఈ దాడులతో భయపడేది లేదని స్పష్టం చేశారు. ఈ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో మరో టీఎంసీ ఎంపీపై హుగ్లీలో దాడి జరిగింది. హుగ్లీ జిల్లాలోని చండీతాలలో ఎంపీ కల్యాణ్ బెనర్జీ పర్యటిస్తుండగా ఆయనపై #TMC MP Kalyan Banerjee allegedly attacked in Hooghly. pic.twitter.com/4Sdd1oViaX హుగ్లీ జిల్లాలోని చండీతాలలో ఎంపీ కల్యాణ్ బెనర్జీ పర్యటిస్తుండగా ఆయనపై కొంత మంది దాడులు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు ఒక్కసారిగా మూక దాడి చేశారు. భద్రతా సిబ్బంది వారిని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలోనే కొందరు ఆయన తలపై కొట్టారు. దీంతో ఒక్కసారిగా ఆయన కుప్పకూలీపోయారు. దాడికి ముందు కొందరు వ్యక్తులు కల్యాణ్ బెనర్జీకి పర్యటనకు వ్యతిరేకంగా నల్ల జెండాలు చూపిస్తూ 'చోర్ చోర్' (దొంగ దొంగ) అని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. Read more: Mamata Banerjee: రెచ్చిపోయిన మమతా బెనర్జీ.. ఆస్పత్రి సీఈవోకు మాస్ వార్నింగ్.. అసలేం జరిగిందంటే..?.. అంతే కాకుండా గో బ్యాక్ అంటూ గట్టిగా నినాదాలు చేశారు. అచ్చం నిన్న దక్షిణ 24 పరగణాల జిల్లా సోనార్‌పూర్‌లో అభిషేక్ బెనర్జీ పర్యటనలోనూ ఇలాంటి దృశ్యాలే కనిపించాయి. ఈ ఘటనతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో భారీగా టీఎంసీ కార్యకర్తలు, నేతలు అక్కడకు చేరుకుని బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్...