
సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు డిస్కంలు పెడతామని సీఎం ఎలా అంటున్నారని ప్రశ్నించారు. హైదరాబాద్, మే31 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డిపై (CM Revanth Reddy) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు డిస్కంలు పెడతామని సీఎం ఎలా అంటున్నారని ప్రశ్నించారు. కంటోన్మెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం ఈరోజు (ఆదివారం) జరిగింది. ఈ సమావేశానికి కేటీఆర్ హాజరై మాట్లాడారు. సర్(SIR)పై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కేసీఆర్ హయాంలో హైదరాబాద్‌లో కరెంట్ పరిస్థితి ఎంత బాగుందో చూశామని కేటీఆర్ తెలిపారు. దేశ చరిత్రలో రైతులకు 24గంటల కరెంట్ ఇచ్చిన ఘనత కేసీఆర్‌దేనని వ్యాఖ్యానించారు. కేంద్రంలో కాంగ్రెస్‌ను ఓడిస్తే... తెలంగాణలో మాత్రం తెచ్చుకొని నెత్తిన పెట్టుకున్నారని.. ఇప్పుడు అనుభవిస్తున్నారని చెప్పారు. కంటోన్మెంట్ ఉపఎన్నిక సమయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 6వేల ఇళ్లు కడతామని చెప్పారని అన్నారు. రాష్ట్రంలో 6వేల ఇళ్లు కాదు కదా... కనీసం 6 ఇళ్లు కూడా కట్టలేని పరిస్థితి ఉందని విమర్శించారు. కేసీఆర్ హయాంలో లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టామని ప్రస్తావించారు. రెండున్నరేళ్లలో ఒక్క ఇల్లు అయినా కట్టారా..? అని ప్రశ్నించారు. అవి కడితే చూపించాలని సవాల్ చేశారు. జేబులో కత్తెర, రిబ్బన పెట్టుకొని సీఎం రేవంత్‌రెడ్డి తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ హయాంలో కట్టిన ఫ్లై ఓవర్లను.. ఆయన ప్రారంభిస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ సెటైర్లు గుప్పించారు. Home » Telangana » Hyderabad » KTR Criticizes CM Revanth Reddy Over Double Bedroom Houses VK ABN , Publish Date - May 31 , 2026 | 03:07 PM