
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Cobra In Puja Room Viral video Watch: ఒక నాగుపాముకు సంబంధించిన అరుదైన దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. సామాజిక మాధ్యమాల్లో నిత్యం ఎన్నో పాముల వీడియోలు కనిపిస్తూ ఉంటాయి.. కానీ దేవుడి గదిలో ప్రత్యక్షమైన ఒక అత్యంత ప్రమాదకరమైన నాగుపాము కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఒక ఇంటిలోని పూజా గదిలో.. సాక్షాత్తు శ్రీరాముడి ఫోటో పక్కనే అత్యంత ప్రమాదకరమైన నాగుపాము పడకవిప్పి కూర్చోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో లేదా శివారు ప్రాంతాల్లో పాములు ఇళ్ళలోకి రావడం చూస్తూ ఉంటాం.. అయితే, ఈ ఘటనలో నాగుపాము నేరుగా ఇంట్లోని దేవుడి గదిలోకి ప్రవేశించింది.. నిత్యం పూజలు చేసే ఆ గదిలో.. శ్రీరాముడి పటాన్ని ఆనుకొని నిలబడింది. ఉదయాన్నే పూజ చేద్దామని వెళ్లిన ఇంటి యజమాని.. అక్కడ మృత్యుల పడక విప్పి బుసలు కొడుతున్న భారీ నాగుపామును చూసి ఒక్కసారిగా షాక్‌కు గురైయ్యాడు.. ప్రాణ భయంతో గది బయటకు పరుగులు తీసి.. కుటుంబ సభ్యులను అప్రమత్తం చేశాడు.. పూజా గదిలో నాగుపాము ఉన్నదని కుటుంబ సభ్యులు ఇంటి బయటకు వెళ్లి ఇతరులకు చెప్పడంతో.. ఈ వింతను చూసేందుకు స్థానికులు సైతం భారీగా తరలివచ్చారు. కొందరు భక్తితో దానికి నమస్కరించుకోగా.. పూజా గదిలో నాగుపాము ఉన్నదని కుటుంబ సభ్యులు ఇంటి బయటకు వెళ్లి ఇతరులకు చెప్పడంతో.. ఈ వింతను చూసేందుకు స్థానికులు సైతం భారీగా తరలివచ్చారు. కొందరు భక్తితో దానికి నమస్కరించుకోగా.. మరి కొంతమంది అత్యంత ప్రమాదకరమైన విశ్వసర్పం కావడంతో వెంటనే పాములు పట్టే వారికి సమాచారం అందించారు.. సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్.. ఎంతో చాకచక్యంగా ఆ నాగుపామును పట్టుకునేందుకు ప్రయత్నం చేశారు. పూజా సామాగ్రిల మధ్య ఉన్న పాములు ఎలాంటి గాయం లేకుండా.. సురక్షితంగా స్నేక్ స్టిక్ సహాయంతో పట్టుకున్నట్లు సమాచారం.. A post shared by Munna Msr (@munna_snake_rescuer) Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం.. ఆ సమయంలో అక్కడున్న వారు తమ స్మార్ట్‌ఫోన్స్‌లో రికార్డు చేసిన వీడియోలతో పాటు ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. అంతే ఇలా పోస్ట్ చేసిన వీడియో ఒక్కసారిగా వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన వారంతా రకరకాలుగా స్పందిస్తూ వస్తున్నారు.. సాక్షాత్తు ఆ రాముడికి రక్షణగా శేష సర్పం వచ్చినట్లుంది అని కొంతమంది రాముడు భక్తులు కామెంట్లు చేస్తున్నారు.. కానీ వన్యప్రాణి ప్రేమికులు మాత్రం దాన్ని సురక్షితంగా అడవి ప్రాంతంలో వదిలిపెట్టాలని కోరుతున్నారు. ఏది ఏమైనా ఇలా పూజా గదిలోకి నాగుపాము రావడం ఇదే మొదటిసారిగా భావించవచ్చు.. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.. దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ,...