
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. BJP MP Dharmapuri Arvind Reacts On Etela Rajender and Bandi Sanjay Controversy: తెలంగాణ రాజకీయాల్లో ఇటీవల సొంత పార్టీ నేతల మధ్య వివాదాలు అంటూ తరచుగా వార్తలు తెర మీదకు వస్తున్నాయి. కొంత మంది కీలక నేతల మధ్య ఆధిపత్య పోటీ నెలకొందని, ఒకర్నిమరోకరు పార్టీ నుంచి బైటకు పంపేందుకు అధిష్టానం దగ్గర పావులు కదుపుతున్నారని ప్రచారాలు జరుగుతున్నాయి. దీంతో నేతల మధ్య తెలియకుండానే అఘాతం ఏర్పడి లేని పోనీ సమస్యలు ఎదురౌతున్నాయి. ఈ రకమైన ప్రచారాలు అన్ని పార్టీలకు చెందిన నేతల మధ్య ఇటీవల కన్పిస్తున్నాయి. తాజాగా.. గత కొన్ని రోజులుగా మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్, కేంద్ర సహయ మంత్రి బండి సంజయ్ కు తనకు మధ్య గొడవలు అంటూ జరుగుతున్న ప్రచారంపై ఎంపీ ధర్మపురి అర్వింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇటీవల కొంత మంది కావాలని తెలంగాణలో బీజేపీ నేతల మధ్య తరచుగా గొడవలు, ఆధిపత్యపోరు అంటూ ఫెక్ ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. అంతే కాకుండా.. మల్కాజ్ గిరి ఎంపీ శ్రీ ఈటల రాజేందర్ గారిపై ఇటీవల కొందరు వ్యక్తులు చేస్తున్న దుష్ప్రచారంను అభ్యంతరకర బ్యానర్లు ఏర్పాటు చేయడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణ రాజకీయాల్లో ఎంపీ ఈటల రాజేందర్ గారు సౌమ్య స్వభావం కలిగిన నాయకుడని మల్కాజ్ గిరి ఎంపీ శ్రీ ఈటల రాజేందర్ గారిపై ఇటీవల కొందరు వ్యక్తులు చేస్తున్న దుష్ప్రచారంను అభ్యంతరకర బ్యానర్లు ఏర్పాటు చేయడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణ రాజకీయాల్లో ఎంపీ ఈటల రాజేందర్ గారు సౌమ్య స్వభావం కలిగిన నాయకుడని కొనియాడారు. అంతే కాకుండా.. దశాబ్దాలుగా ప్రజా జీవితంలో ఉన్న ఆయనపై దుష్ప్రచారం చేయడం ఏమాత్రం సమంజసం కాదని అన్నారు. Read more: Balka Suman: సింగరేణిపై వివాదాస్పద వ్యాఖ్యలు.. బాల్కసుమన్ కు 14 రోజుల రిమాండ్... చంచల్ గూడకు తరలింపు.. అలాగే ఈటల రాజేందర్ గారు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారికి నాకు మధ్య గొడవలు పెడుతున్నారనేది నూటికి నూరు శాతం అబద్దమని స్పష్టం చేశారు. బండి సంజయ్ గారికి నాకు సోదర భావం తప్ప ఇంకేం లేదని క్లారిటీ ఇచ్చారు. రాజకీయాల్లో ఆరోగ్యకరమైన చర్చలు, ప్రజా సమస్యలపై పోటీ ఉండాలి గానీ వ్యక్తిత్వ హననం, దుష్ప్రచారం చేయడం సరికాదని ఫెక్ ప్రచారం చేసే వారిపై మండిపడ్డారు. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వారు వెంటనే వాటిని నిలిపివేయాలని ఎంపీ ధర్మపురి అర్వింద్ వార్నింగ్ ఇచ్చారు. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్...