
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Green Chilli Eating Challenge Viral Video Watch: సోషల్ మీడియా పుణ్యమా అని నిత్యం ఏదో ఒక వింత వీడియో సోషల్ మీడియా వినియోగదారుల ముందుకు వస్తూనే ఉంది. లైకులతో పాటు వ్యూస్ కోసం కొందరు చేసే సాహసాలు ఒక్కొక్కసారి ఆశ్చర్యపోయేలా చేస్తే.. మరికొన్నిసార్లు భయాందోళనకు గురి చేస్తూ ఉంటాయి.. తాజాగా అలాంటి కోవాకు చెందిన ఆశ్చర్యం కలిగించే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో వైరల్ అవుతూ వస్తోంది. సాధారణంగా కూరగాయల్లో ఒకటో రెండో పచ్చిమిరపకాయలు ఎక్కువైతేనే కారంతో నోరంతా మండిపోతూ ఉంటుంది.. కానీ ఈ వీడియోలో వ్యక్తి మాత్రం అత్యంత ఘాటైన పచ్చిమిరపకాయలను థియేటర్లలో లభించే పాప్‌కార్న్ తిన్నట్లు రెండు చేతులతో గుప్పిళ్ళకొద్దీ నోట్లో వేసుకుని నమిలేస్తున్నాడు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోనే వైరల్‌గా మారింది.. వైరల్ అవుతున్న ఈ వీడియోలో సదరు వ్యక్తి తన ముందు ఒక పెద్ద కంచం నిండా పచ్చిమిరపకాయలను పెట్టుకొని కూర్చుని ఉన్నాడు.. దాదాపు రెండు నుంచి మూడు కేజీలకు పైగా ఉన్న ఆ పచ్చిమిరపకాయలను అతని ఏమాత్రం లెక్కచేయకుండా తినడం ప్రారంభించాడు. ఒకటి రెండు కాదు.. ఒకేసారి పదుల సంఖ్యలో మిరపకాయలను రెండు చేతులతో తీసుకొని నోట్లో కుక్కుకుంటూ.. కటకటా నములుతూ మింగేస్తున్నాడు.. ఈ దృశ్యాలు చూస్తున్న వారికే నోరు వైరల్ అవుతున్న ఈ వీడియోలో సదరు వ్యక్తి తన ముందు ఒక పెద్ద కంచం నిండా పచ్చిమిరపకాయలను పెట్టుకొని కూర్చుని ఉన్నాడు.. దాదాపు రెండు నుంచి మూడు కేజీలకు పైగా ఉన్న ఆ పచ్చిమిరపకాయలను అతని ఏమాత్రం లెక్కచేయకుండా తినడం ప్రారంభించాడు. ఒకటి రెండు కాదు.. ఒకేసారి పదుల సంఖ్యలో మిరపకాయలను రెండు చేతులతో తీసుకొని నోట్లో కుక్కుకుంటూ.. కటకటా నములుతూ మింగేస్తున్నాడు.. ఈ దృశ్యాలు చూస్తున్న వారికే నోరు మండిపోయేలా ఉన్నాయి.. మిరపకాయల్లోని ఘాటుతో పాటు క్యాప్సైసిన్ ప్రభావంతో కాసేపటికే ఆ వ్యక్తి తీవ్ర ఇబ్బందికి గురయ్యాడు. కళ్ల వెంట నీళ్లు తిరగడంతో పాటు ముఖమంతా ఎర్రగా మారిపోవడం.. కారంతో విలవిలలాడటం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.. అయినప్పటికీ మొండిగా ఆ కారాన్ని భరిస్తూ.. మధ్య మధ్యలో కాస్త ఇబ్బంది పడుతూనే అతని ప్లేట్లో ఉన్న మిరపకాయలన్నింటిని ఖాళీ చేసే ప్రయత్నం చేస్తున్నాడు.. A post shared by Tomi Purnama (@tomi.purnama.378) ఈ షాకింగ్ వీడియో ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో విపరీతంగా వైరల్ అవుతుంది. ఈ వీడియోను ఇప్పటివరకు కొన్ని వేల మందికి పైగా సోషల్ మీడియా వినియోగదారులు వీక్షించినట్లు తెలుస్తోంది. అయితే వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు రకరకాలుగా స్పందిస్తూ వస్తున్నారు.. వీడికి కడుపులో పేగులు బద్దలై పోవడం ఖాయమని.. వ్యూస్ కోసం ఇంత పిచ్చా అని అంటూ సోషల్ మీడియా వినియోగదారులు వీడియో కింద కామెంట్లు పెడుతూ వస్తున్నారు.. Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం.. మరో వైపు వైద్య నిపుణులు కూడా ఈ వీడియో పై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకేసారి ఎన్ని పచ్చిమిరపకాయలు తింటే కడుపులో తీవ్రమైన అల్సర్లు రావడంతో పాటు పెద్ద పేగులు కాలిపోవడం, అంతర్గత రక్తస్రావం జరిగి ప్రాణాలకే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని.. ఎవరు కూడా ఇలాంటి పిచ్చి పనులు ప్రయత్నించవద్దని హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేందుకు ఇలాంటి కంటెంట్ తెచ్చుకోవడం అసలు సరికాదని వారు చెబుతున్నారు.. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.. దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ,...