
ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్లో ఆత్మాహుతిదాడి (Explosion in Pakistan ) చోటుచేసుకుంది. క్వెట్టా ప్రాంతంలోని చమన్ ఫాటక్ రైల్వేస్టేషన్ సమీపంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 24 మంది ప్రాణాలు కోల్పోగా.. ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్లో ఆత్మాహుతిదాడి (Explosion in Pakistan ) చోటుచేసుకుంది. క్వెట్టా ప్రాంతంలోని చమన్ ఫాటక్ రైల్వేస్టేషన్ సమీపంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 24 మంది ప్రాణాలు కోల్పోగా.. 50మందికి పైగా గాయపడ్డారు. ఆర్మీ జవాన్లు, వారి కుటుంబ సభ్యులతో ప్రయాణిస్తున్న రైలు స్టేషన్ సమీపంలోని సిగ్నల్ దాటుతుండగా.. పేలుడు పదార్థాలతో ఉన్న వాహనం రైలు బోగీని ఢీకొట్టినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో పేలుడు సంభవించిందన్నారు. మృతుల్లో ఎక్కువమంది సైనికులే ఉన్నారన్నారు. పేలుడు దాటికి రైలు పాక్షకంగా దెబ్బతిందని.. 10కి పైగా వాహనాలు దగ్ధమయ్యాయని తెలిపారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు. రైల్వే స్టేషన్ సమీపంలో పేలుడు చోటుచేసుకోవడంతో రైళ్ల రాకపోకల్లో అంతరాయం కలిగినట్లు అధికారులు వెల్లడించారు. క్వెట్టా నుంచి పెషావర్ వెళ్లే జాఫర్ ఎక్స్ప్రెస్ను స్టేషన్లో నిలిపివేసినట్లు తెలిపారు. పేలుడు జరిగిన ప్రాంతానికి సమీపంలో ప్రజలు గుమిగూడవద్దని పాక్ హోం మంత్రి ఆదేశాలు జారీ చేశారు. రైల్వే స్టేషన్ సమీపంలో పేలుడు ఘటన తమ పనేనని బలోచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) ప్రకటించింది. క్వెట్టా కంటోన్మెంట్ నుంచి పాక్ దళాల సిబ్బందిని తీసుకువెళ్తున్న రైలును లక్ష్యంగా చేసుకున్నామని బలోచ్ ఆర్మీ ప్రతినిధి జీయాండ్ బలోచ్ వెల్లడించారు. బలోచ్ ఆర్మీలోని మహిళా షైనాజ్ బలోచ్ ఓ వీడియోలో మాట్లాడుతూ.. పాక్ నేతలు తమ ప్రజలను అణచివేస్తున్నారని అన్నారు. తమ సంస్కృతి, గుర్తింపు, హక్కులను కాలరాస్తున్నారని ఆరోపించారు. అణచివేతకు గురైన ప్రతి బలోచ్ బిడ్డ తన మాతృభూమి విముక్తి కోసం ప్రాణాలను సైతం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాడని ఆమె పేర్కొన్నారు. ఇదీ చదవండి: చైనా బొగ్గుగనిలో పేలుడు 90 మంది కార్మికుల మృతి గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
Summary status: pending