
భారత్‌లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేందుకు పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ కొత్త ఆయుధాన్ని ప్రయోగిస్తోందా? సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ముసుగులో యువతను ఉగ్రవాదం వైపు మళ్లిస్తూ, దాడులకు కుట్రలు పన్నుతున్న పాకిస్థానీ షాజాద్ భట్టి కార్యకలాపాలు చూస్తుంటే అవుననే అంటున్నాయి భారత భద్రతా ఏజెన్సీలు. ఒకప్పుడు సోషల్ మీడియా స్టార్‌గా ఉండి, ఇప్పుడు ఐఎస్ఐ ఆపరేటివ్‌గా మారినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భట్టి, పాక్ కొత్త వ్యూహంలో కీలక పాత్రధారిగా మారాడని అధికారులు అనుమానిస్తున్నారు.తాజాగా మే 30, 31 తేదీల్లో ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్... భట్టికి చెందిన నెట్‌వర్క్‌పై భారీ ఆపరేషన్ నిర్వహించింది. 8 నుంచి 9 మంది అనుమానితులను అరెస్ట్ చేసింది. వీరి నుంచి పాకిస్థాన్‌లో తయారైన 4 హ్యాండ్ గ్రెనేడ్లు, 2 గ్లాక్ పిస్టళ్లు, 24 రౌండ్ల తూటాలు, దొంగిలించిన వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీలోని ఒక చారిత్రక ఆలయం, సోనిపట్ హైవేపై ఉన్న దాబా, హరియాణాలోని హిసార్ సైనిక శిబిరంపై దాడికి వీరు ప్లాన్ చేసినట్టు విచారణలో తేలింది.ఎవరీ షాజాద్ భట్టి?పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌కు చెందిన భట్టి, '333' అనే హ్యాండిల్‌తో సోషల్ మీడియాలో గుర్తింపు పొందాడు. భారత్-పాక్ సంబంధాలు, మతపరమైన అంశాలపై పోస్టులు పెడుతూ ఫాలోయింగ్‌ను పెంచుకున్నాడు. అయితే, 2013లోనే ఇతనిపై పాక్‌లో దొంగతనం, దోపిడీ, అత్యాచారం వంటి కేసులున్నాయి. 2015లో దుబాయ్ పారిపోయి, అక్కడ ఐఎస్ఐ హ్యాండ్లర్లయిన అబిద్ జాట్, అజ్మల్ గుజ్జర్ వంటి వారితో సంబంధాలు ఏర్పరుచుకున్నట్టు ఏజెన్సీలు గుర్తించాయి.డబ్బు, కీర్తి ప్రతిష్ఠల ఆశ చూపి సోషల్ మీడియా ద్వారానే భారత్‌లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేందుకు పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ కొత్త ఆయుధాన్ని ప్రయోగిస్తోందా? సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ముసుగులో యువతను ఉగ్రవాదం వైపు మళ్లిస్తూ, దాడులకు...