
Telangana EHS:తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లలో ప్రస్తుతం EHS (ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్) 1.5 శాతం కోతలపై ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయి మార్గదర్శకాలు, హెల్త్ కార్డుల పంపిణీ ఇంకా పూర్తికాకముందే జీతాల్లో కోతలు కనిపిస్తున్నాయని పలువురు ఉద్యోగులు చెబుతున్నారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధుల సమాచారం ప్రకారం, ప్రస్తుతం అప్లోడ్ అవుతున్న పేస్లిప్లలో EHS పేరుతో 1.5 శాతం కోతలు నమోదవుతున్నాయి. అయితే ఇది కేవలం సాంకేతిక పరీక్షలో భాగమా లేక నిజంగానే అమలులోకి తీసుకొచ్చారా అనే విషయంలో స్పష్టత లేదని వారు పేర్కొంటున్నారు. మరోవైపు, భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్న కుటుంబాల్లో కూడా ఇద్దరి జీతాల నుంచి కోతలు పడుతున్నట్లు సమాచారం వస్తోంది. సాధారణంగా ఒక కుటుంబానికి ఒకరికి మాత్రమే కోత ఉండాలనే నిబంధన ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఇద్దరికీ కోతలు కనిపిస్తున్నాయని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులు చెబుతున్న వివరాల ప్రకారం, ఇంకా అనేక ఆస్పత్రులతో ఒప్పందాలు పూర్తి కాలేదని, హెల్త్ కార్డుల పంపిణీ ప్రక్రియ కూడా పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదని అంటున్నారు. అలాగే ఉద్యోగులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా, డీడీఓలకు స్పష్టమైన సూచనలు అందించకుండా కోతలు విధించడం సరైన విధానం కాదని అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ నాయకులు కటకం రమేష్, మారెడ్డి అంజిరెడ్డి కూడా ఈ అంశంపై స్పందించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లలో అనేక సందేహాలు ఉన్నాయని, ప్రభుత్వం త్వరగా స్పష్టత ఇవ్వాలని వారు కోరుతున్నారు. ఇప్పటికే డీఏ బకాయిలు, పీఆర్సీ అమలు, విద్యా విధానంపై స్పష్టత వంటి పలు అంశాలు పెండింగ్లో ఉన్నాయని ఉద్యోగ సంఘాలు గుర్తుచేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో EHS కోతల అంశం కొత్త ఆందోళనకు కారణమైందని చెబుతున్నారు. అయితే EHS అయితే EHS కోతలపై ప్రభుత్వం నుంచి అధికారిక వివరణ వస్తే పరిస్థితిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ప్రభుత్వ స్పందన కోసం ఎదురుచూస్తున్నారు. Telangana EHS:తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లలో ప్రస్తుతం EHS (ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్) 1.5 శాతం కోతలపై ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయి...