
హైదరాబాద్ శివారు గండిపేటలో వెలుగు చూసిన భారీ భూ కుంభకోణం కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. సుమారు రూ.1500 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని నకిలీ పత్రాలతో కబ్జా చేసేందుకు జరిగిన ఈ కుట్రలో కీలక వ్యక్తి వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడేనని, అందుకు తమ వద్ద పక్కా ఆధారాలున్నాయని శేరిలింగంపల్లి డీసీపీ శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఆదివారం నాడు విలేకరుల సమావేశంలో ఈ కేసుకు సంబంధించిన కీలక వివరాలను ఆయన వెల్లడించారు.డీసీపీ శ్రీనివాస్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ కుంభకోణంలో బొల్లా బ్రహ్మనాయుడి పాత్ర అత్యంత కీలకంగా ఉంది. గండిపేటలోని వివాదాస్పద భూమిని క్రమబద్ధీకరించినట్లుగా నకిలీ ప్రభుత్వ ఉత్తర్వు (జీవో) సృష్టించేందుకు, ప్రధాన నిందితుడైన రాధాకృష్ణకు బ్రహ్మనాయుడు రూ.4 కోట్లు చెల్లించినట్లు విచారణలో తేలిందని డీసీపీ తెలిపారు. ఈ లావాదేవీలన్నీ నగదు రూపంలోనే జరిగాయని, ఈ సొమ్ము ఎక్కడికి వెళ్లిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈ కుట్రలో భాగంగా నిందితులు అత్యంత పకడ్బందీగా నకిలీ పత్రాలు సృష్టించారని, కలెక్టర్, సీసీఎల్ఏ కార్యాలయాల నుంచి అనుమతులు వచ్చినట్లు నకిలీ దస్త్రాలు, ఐఏఎస్ అధికారుల ఫోర్జరీ సంతకాలతో ఉత్తర్వులు తయారు చేశారని వివరించారు.గండిపేట తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదు మేరకు ఈ కేసును నమోదు చేసినట్లు డీసీపీ తెలిపారు. వాట్సాప్ గ్రూపులలో నకిలీ జీవోలు సర్క్యులేట్ కావడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఇప్పటికే నిమ్మల రాజేష్ గౌడ్, నిమ్మల వేణుగోపాల్, నిమ్మల సాయికిరణ్లతో పాటు ప్రధాన నిందితుడు రాధాకృష్ణ, అతని డ్రైవర్ హైదరాబాద్ శివారు గండిపేటలో వెలుగు చూసిన భారీ భూ కుంభకోణం కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. సుమారు రూ.1500 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని నకిలీ పత్రాలతో కబ్జా చేసేందుకు...