
ఇంటర్నెట్‌డెస్క్: ప్రస్తుతం ఇండస్ట్రీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి దర్శకరత్న దాసరి నారాయణరావు ఎప్పుడో దారి చూపారని మంచు మనోజ్ అన్నారు. దాసరి నారాయణరావు సమాధి దుస్థితి చూసి చలించిపోయిన ఆయన తన టీమ్‌తో కలిసి శుభ్రం చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తన సతీమణి మౌనికతో కలిసి దాసరి విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘గురువుగారు దాసరి వర్థంతి అన్న సంగతి నాకూ గుర్తులేదు. చిత్రపురి కాలనీ వైపు వస్తుంటే, ఆ దారిలో గురువుగారి విగ్రహం ఉంటుంది. అది చూడగానే ఆయన కుటుంబం గుర్తు వచ్చింది. ఈలోగా ఆయన సమాధి పరిస్థితి తెలుసుకుని నా టీమ్‌తో కలిసి ఉదయాన్నే వచ్చేశా. అందరూ ఎంతో శ్రమించారు’’ ‘‘దాసరిగారు గొప్ప దర్శకుడు. స్క్రీన్‌ప్లే రైటర్. ఎడిటింగ్, మ్యూజిక్, డైలాగ్స్ ఇలా అన్నింటిపైనా పట్టు కలిగిన వ్యక్తి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయనొక ఇనిస్టిట్యూట్. ఆయన ఎన్నో గొప్ప సినిమాలు తీశారు. సోషల్, కమర్షియల్, మహిళా ప్రాధాన్యమున్న చిత్రాలు రూపొందించారు. ‘దాసరి పని అయిపోయింది’ అని టాక్ వినిపించిన ప్రతిసారీ కొత్తదనంతో ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం మనం థియేటర్స్ సమస్యలంటూ మాట్లాడుకుంటున్నాం. కానీ, నాకు తెలిసి గురువుగారు ఎప్పుడో దీనికి ఓ మార్గం చూపించారు. ఏడాదికి పది నుంచి పదిహేను సినిమాలు చేస్తూ.. ఎంతో మందికి ఉపాధి లభించేలా చేశారు. ఎప్పుడో ఓ సినిమా చేయటం కాదు.. ఎప్పుడూ సినిమా చేయాలని దాసరి అనేవారు. ఇకపై నాతో సహా అందరూ హీరోలు వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేయాలని కోరుతున్నాను. ఆ బాధ్యత అందరిపైనా ఉంది. దాసరి ఘాట్‌ను పార్క్‌లా కాకుండా చుట్టు పక్కల పిల్లలు ఆడుకునేలా తీర్చిదిద్దితే బాగుంటుందని అనుకుంటున్నా’’ అని అన్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. కృష్ణ జయంతిని పురస్కరించుకుని ‘శ్రీనివాస మంగాపురం’ టీమ్.. ఈ మూవీ గ్లింప్స్‌ను విడుదల చేసింది. అజిత్ ఇంటికి సీఎం విజయ్, త్రిష కలిసి వెళ్లారు. సంబంధిత వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in © 1999 - 2026 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved. Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted. This website follows the DNPA Code of Ethics. ఇంటర్నెట్‌డెస్క్: ప్రస్తుతం ఇండస్ట్రీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి దర్శకరత్న దాసరి నారాయణరావు ఎప్పుడో దారి చూపారని మంచు మనోజ్ అన్నారు. దాసరి నారాయణరావు సమాధి దుస్థితి చూసి...