
ఇంటర్నెట్ డెస్క్: టీ20 క్రికెట్లో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలకు సమప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ వ్యాఖ్యానించారు. 200+ స్కోర్లు అలవోకగా వచ్చేస్తున్న వేళ బౌలర్లకు ఏమాత్రం అడ్వాంటేజ్ లేకుండా పోతోంది. ఈ క్రమంలో ఐపీఎల్లో ఆటను మరింత రసవత్తరంగా మార్చేందుకు మూడు కీలక మార్పులు చేస్తే బాగుంటుందని సచిన్ సూచించారు. తాజాగా ఓ అవార్డుల కార్యక్రమంలో సచిన్ పాల్గొన్నారు. మరి ఆయన చెప్పిన ఛేంజెస్ ఏంటో మనమూ చూద్దాం.. ‘‘నేను వ్యక్తిగతంగా గమనించిన పలు విషయాలను మీతో పంచుకుంటున్నా. ఐపీఎల్లో వినియోగిస్తున్న ఇంపాక్ట్ రూల్‌ను తీసేయాల్సిన అవసరం ఉంది. టీ20 అంటేనే కేవలం 20 ఓవర్ల ఆట. ఇప్పటికే ఉన్న బ్యాటింగ్ లైనప్‌కు అదనంగా మరొకరిని తీసుకుంటున్నారు. ఇప్పటికే బౌలర్లకు పెనుసవాల్‌గా మారింది. ఇప్పుడు మరొక బ్యాటర్ అంటే బౌలర్లకు మరింత కష్టమైపోయింది. నాకు అక్కడ సమతుల్యత లేదనిపించింది’’ అని సచిన్ వెల్లడించారు. ‘‘ఇప్పుడు టీ20ల్లో తొలి ఆరు ఓవర్లను పవర్‌ప్లేగా పిలుస్తున్నాం. కేవలం ఇద్దరు ఫీల్డర్లు మాత్రమే రింగ్ బయట ఉండాలి. ఇప్పుడున్న నిబంధనలతోనే తొలి నాలుగు ఓవర్ల గేమ్ నిర్వహించాలి. ఇక మిగిలిన రెండు పవర్‌ప్లే ఓవర్లను బౌలింగ్ టీమ్ సారథి నిర్ణయం మేరకు వదిలేయాలి. అతడు ఎప్పుడు వాడుకోవాలనేది అతడి ఇష్టం. కానీ, ఫీల్డింగ్ నిబంధనల్లో మాత్రం ఎలాంటి మార్పు ఉండక్కర్లేదు. ఇలా చేయడం వల్ల మ్యాచ్ ఇరు జట్లకూ నియంత్రణలోనే ఉన్నట్లు అనిపిస్తుంది’’ అని సచిన్ అభిప్రాయపడ్డారు. పైన రెండింటితోపాటు మరో కీలక మార్పు తీసుకొస్తే బాగుంటుందని సచిన్ చెప్పారు. టీ20ల్లో ఒక బౌలర్‌కు ఐదు ఓవర్లు వేసే అవకాశం ఇవ్వాలని సూచించారు. ఇప్పటి వరకు నిబంధనల ప్రకారం.. గరిష్ఠంగా ఒకరు నాలుగు ఓవర్లు పైన రెండింటితోపాటు మరో కీలక మార్పు తీసుకొస్తే బాగుంటుందని సచిన్ చెప్పారు. టీ20ల్లో ఒక బౌలర్‌కు ఐదు ఓవర్లు వేసే అవకాశం ఇవ్వాలని సూచించారు. ఇప్పటి వరకు నిబంధనల ప్రకారం.. గరిష్ఠంగా ఒకరు నాలుగు ఓవర్లు మాత్రమే వేయాలి. ‘‘జట్టులోని ఏదొక బౌలర్‌కు మాత్రమే ఐదు ఓవర్లు వేసే అవకాశం ఇవ్వాలి. అత్యుత్తమ బౌలరే ఆ ఓవర్‌ను వేస్తాడు. మరి బెస్ట్ బౌలర్ బౌలింగ్‌ను ఎవరికైనా చూడాలని అనిపిస్తుంది కదా.. టాప్ బ్యాటర్లు 20 ఓవర్లూ ఆడుతున్నప్పుడు బెస్ట్ బౌలర్‌కు ఐదో ఓవర్ ఎందుకు ఇవ్వకూడదు?’’ అని సచిన్ వ్యాఖ్యానించారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in © 1999 - 2026 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved. Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted. This website follows the DNPA Code of Ethics. ఇంటర్నెట్ డెస్క్: టీ20 క్రికెట్లో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలకు సమప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ వ్యాఖ్యానించారు. 200+ స్కోర్లు అలవోకగా...