సౌత్ స్టార్ మ్యూజిక్ కంపోజర్స్ లో ఎస్. తమన్ ఒకరు. చార్ట్ బస్టర్ సాంగ్స్, అదిరిపోయే రీరికార్డింగ్ తో సినీ సంగీత ప్రపంచంలో తనదైన ముద్ర వేసుకున్నారు. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. తమన్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ మాత్రమే కాదు, క్రికెటర్ కూడా. కెరీర్లో దూసుకుపోతున్న ఆయన సంగీతంతో పాటు క్రికెట్‌పైనా మక్కువ చూపిస్తుంటారు. ఎంత తీరికలేని షెడ్యూల్ ఉన్నప్పటికీ, అవకాశం దొరికినప్పుడల్లా బ్యాట్ పట్టుకుని మైదానంలోకి దిగడం తమన్ అలవాటుగా మార్చుకున్నారు. సెలబ్రిటీ క్రికెట్ వేదికలపై కూడా తమన్ తన ప్రతిభను చాటుకున్నారు. CCLలో తెలుగు వారియర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఆయన, గతంలో ఎన్నో మ్యాచ్‌ల్లో తన ఆల్‌రౌండర్ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ తన వంతు సహకారం అందిస్తూ జట్టుకు విజయాలు అందించారు. అన్నట్టు ఆయనకు 'థమన్ హిట్టర్స్ హైదరాబాద్' అనే క్రికెట్ టీమ్ కూడా ఉంది. ఇందులో ఆది సాయి కుమార్, అశ్విన్ బాబు వంటి పలువురు టాలీవుడ్ హీరోలు టీమ్ మెంబర్స్ గా ఉన్నారు.తాజాగా జరిగిన ఒక మ్యాచ్‌లో తమన్ తన అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. కేవలం 55 బంతుల్లోనే 122 పరుగులు సాధించి క్రికెట్ అభిమానులను అలరించారు. అందులో 7 సిక్సులు, 18 ఫోర్లు ఉన్నాయి. అశ్విన్ బాబు 57, ఆది సాయికుమార్ 41 రన్స్ చేయడంతో.. 'థమన్ హిట్టర్స్ హైదరాబాద్' జట్టు 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేయగలింది. ఈ మ్యాచ్ వివరాలను ఆది సోషల్ మీడియాలో పంచుకున్నారు. విధ్వంసకర బ్యాటింగ్ చేసిన తమన్ ను క్రికెటర్ వైభవ్ సూర్యవంశీతో కంపేర్ చేశారు.* రూ.300 కోట్ల క్లబ్‌లోకి వీరభద్రుడు.. చిత్ర సౌత్ స్టార్ మ్యూజిక్ కంపోజర్స్ లో ఎస్. తమన్ ఒకరు. చార్ట్ బస్టర్ సాంగ్స్, అదిరిపోయే రీరికార్డింగ్ తో సినీ సంగీత ప్రపంచంలో తనదైన ముద్ర వేసుకున్నారు. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. తమన్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ మాత్రమే కాదు, క్రికెటర్ కూడా. కెరీర్లో దూసుకుపోతున్న ఆయన సంగీతంతో పాటు క్రికెట్‌పైనా మక్కువ చూపిస్తుంటారు. ఎంత తీరికలేని షెడ్యూల్ ఉన్నప్పటికీ, అవకాశం దొరికినప్పుడల్లా బ్యాట్ పట్టుకుని మైదానంలోకి దిగడం తమన్ అలవాటుగా మార్చుకున్నారు. సెలబ్రిటీ క్రికెట్ వేదికలపై కూడా తమన్ తన ప్రతిభను చాటుకున్నారు. CCLలో తెలుగు వారియర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఆయన, గతంలో ఎన్నో మ్యాచ్‌ల్లో తన ఆల్‌రౌండర్ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ తన వంతు సహకారం అందిస్తూ జట్టుకు విజయాలు అందించారు. అన్నట్టు ఆయనకు 'థమన్ హిట్టర్స్ హైదరాబాద్' అనే క్రికెట్ టీమ్ కూడా ఉంది. ఇందులో ఆది సాయి కుమార్, అశ్విన్ బాబు వంటి పలువురు టాలీవుడ్ హీరోలు టీమ్ మెంబర్స్ గా ఉన్నారు.తాజాగా జరిగిన ఒక మ్యాచ్‌లో తమన్ తన అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. కేవలం 55 బంతుల్లోనే 122 పరుగులు సాధించి క్రికెట్ అభిమానులను అలరించారు. అందులో 7 సిక్సులు, 18 ఫోర్లు ఉన్నాయి. అశ్విన్ బాబు 57, ఆది సాయికుమార్ 41 రన్స్ చేయడంతో.. 'థమన్ హిట్టర్స్ హైదరాబాద్' జట్టు 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేయగలింది. ఈ మ్యాచ్ వివరాలను ఆది సోషల్ మీడియాలో పంచుకున్నారు. విధ్వంసకర బ్యాటింగ్ చేసిన తమన్ ను క్రికెటర్ వైభవ్ సూర్యవంశీతో కంపేర్ చేశారు.* రూ.300 కోట్ల క్లబ్‌లోకి వీరభద్రుడు.. చిత్ర యూనిట్‌కు లగ్జరీ కార్లు గిఫ్ట్‌గా ఇచ్చిన హీరో సూర్యతమన్ ఈ ఇన్నింగ్స్‌లో తనదైన దూకుడైన షాట్లు, వేగవంతమైన స్కోరింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దీంతో “టాలీవుడ్ కా వైభవ్ సూర్యవంశీ తమన్ అన్న’’ అంటూ స్కోర్ వివరాలను ఆది సాయి కుమార్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. దీనిపై తమన్ స్పందిస్తూ “బాధ & చిరునవ్వు’’ అని క్యాప్షన్ పెట్టారు. ఆట సమయంలో తనకు తగిలిన గాయాలను గుర్తు చేసుకుంటూ ఓ ఫోటోను పోస్ట్ చేశారు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన మ్యూజిక్ తో సంగీత ప్రియులను అలరిస్తున్న తమన్.. ఇప్పుడు ఆటల్లోనూ తన అంకితభావంతో నెటిజన్ల ప్రశంసలు అందుకున్నారు.IPL 2026 సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన వైభవ్ సూర్యవంశీ.. తన ప్రదర్శనతో స్టార్ బ్యాటర్ గా అవతరించాడు. అత్యంత చిన్న వయసులో క్రికెట్ లో అడుగుపెట్టిన సూర్యవంశీ.. ఈ సీజన్ లో సిక్సులు, ఫోర్లతో పరుగుల వరద పారించాడు. గత రికార్డులన్నీ చెరిపేసి, స్టార్ క్రికెటర్లకు కూడా సాధ్యంకాని ఎన్నో సరికొత్త రికార్డులు క్రియేట్ చేశాడు. తన టీమ్ ఫైనల్ కి చేరుకోకపోయినా, ‘బాస్ బేబీ’గా అందరి ప్రశంసలు అందుకున్నాడు. ఇప్పుడు అలాంటి విధ్వంసకర బ్యాటర్ తో ఎస్. తమన్ ని పోలిస్తున్నారు ఆది సాయి కుమార్. ‘సెలబ్రిటీ