
PM Kisan 23rd Installment: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద దేశవ్యాప్తంగా ఉన్న రైతులు ఏటా రూ.6000 చొప్పున పొందుతున్నారు. ప్రస్తుతం రైతులు 23వ విడత నిధుల కోసం ఎదురు చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు 22 విడతలు విడుదల చేసింది. అసలు 23వ విడత నిధులు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయి? దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా అర్హత కలిగిన రైతులందరికీ ఏడాదికి రూ.6000 అందుతాయి. ఈ మొత్తాన్ని ప్రతి ఏటా మూడు విడతలుగా, అంటే రూ.2000 చొప్పున నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT) ద్వారా జమ చేస్తున్నారు. ఇప్పుడు రైతులందరూ 23వ విడత కోసం ఎదురుచూస్తున్నారు. సాధారణంగా ఈ నిధులు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి విడుదల చేస్తారు. 22వ విడత ద్వారా ఇప్పటికే 18,640 కోట్లు రైతులకు పంపిణీ చేశారు. తదుపరి విడత జూలై నెలలో విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.కానీ ప్రభుత్వం దీనిపై ఇంకా అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. ప్రధానమంత్రి కిసాన్ పథకం ద్వారా కేవలం భారతీయ రైతులు మాత్రమే ప్రయోజనం పొందగలరు. దీనికి అర్హత ఉండాలంటే రైతు వద్ద వ్యవసాయ భూమి ఉండాలి. చిన్న ,సన్నకారు రైతులు మాత్రమే ఈ పథకానికి అర్హులు. ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారు లేదా నెలకు రూ.10,000 కంటే ఎక్కువ పెన్షన్ తీసుకునే వారు ఈ పథకానికి అర్హత కలిగి ఉండరు. ఈ పథకం నుండి ప్రయోజనం పొందాలంటే రైతులు తమ KYC ప్రక్రియను ముందుగానే పూర్తి చేసుకోవాలి. అప్పుడే తదుపరి విడత నిధులు మీ ఖాతాలో జమ అవుతాయి. ఓటీపీ (OTP) ఈ పథకం నుండి ప్రయోజనం పొందాలంటే రైతులు తమ KYC ప్రక్రియను ముందుగానే పూర్తి చేసుకోవాలి. అప్పుడే తదుపరి విడత నిధులు మీ ఖాతాలో జమ అవుతాయి. ఓటీపీ (OTP) ద్వారా ఈ KYC ని పూర్తి చేయవచ్చు. అలాగే మీ దగ్గర్లోని కామన్ సర్వీస్ సెంటర్ (CSC) ద్వారా కూడా ఈ ప్రక్రియను పూర్తి చేయించుకోవచ్చు. మీరు పీఎం కిసాన్ స్టేటస్‌ను అధికారిక వెబ్సైట్ pmkisan.gov.in లో చెక్ చేసుకోవచ్చు. అక్కడ 'Know Your Status' అనే ఆప్షన్‌ను ఎంచుకుని, మీ రిజిస్ట్రేషన్ నంబర్ లేదా బ్యాంక్ అకౌంట్ వివరాలను నమోదు చేసి 'Get Data' పై క్లిక్ చేస్తే, తదుపరి నిధులు మీకు వస్తాయో లేదో తెలుస్తుంది. PM Kisan 23rd Installment: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద దేశవ్యాప్తంగా ఉన్న రైతులు ఏటా రూ.6000 చొప్పున పొందుతున్నారు. ప్రస్తుతం రైతులు 23వ విడత నిధుల కోసం ఎదురు...