
ఐపీఎల్ 2026 ఫైనల్ ఆదివారం రాత్రి 7 గంటల నుంచి నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న నేపథ్యంలో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) పేసర్ భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌పై భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సీజన్లో భువీ విజయ రహస్యం 'వొబ్లీ సీమ్' బౌలింగేనని, ఈ కొత్త ఆయుధంతో అతను బ్యాటర్లను పూర్తిగా కట్టడి చేస్తున్నాడని విశ్లేషించారు.ఈ సీజన్లో ఆర్సీబీ ఫైనల్ చేరడంలో భువనేశ్వర్ కీలక పాత్ర పోషించాడు. 15 మ్యాచ్‌లలో 26 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ఫైనల్ మ్యాచ్‌కు ముందు సచిన్ తన 'ఎక్స్' ఖాతాలో విడుదల చేసిన వీడియోలో భువీ బౌలింగ్‌పై మాట్లాడారు. "ఈ సీజన్లో భువీ బౌలింగ్‌ను గమనిస్తే, అతను 'వొబ్లీ సీమ్' ఉపయోగిస్తున్నాడు. దానివల్ల బంతి లోపలికి వస్తుందో, బయటకు వెళుతుందో బ్యాటర్లు అంచనా వేయలేకపోతున్నారు. భువీ చేస్తున్నది అదే" అని సచిన్ వివరించారు.గతంలో భువీ ఎక్కువగా సంప్రదాయ స్వింగ్‌పై ఆధారపడేవాడని, కానీ ఇప్పుడు ఆ పద్ధతిని స్పృహతోనే మార్చుకున్నాడని సచిన్ అన్నారు. "గతంలో భువీ బంతిని ఎక్కువగా అవుట్ స్వింగ్ లేదా ఇన్ స్వింగ్ చేసేవాడు. కానీ ఇప్పుడు అతను సాధ్యమైనంత నిటారుగా బౌలింగ్ చేస్తున్నాడు. 'వొబ్లీ సీమ్' కారణంగా బంతి పిచ్‌పై పడ్డాక ఎలా కదులుతుందో చెప్పడం కష్టం. ఇదే ఈ సీజన్లో భువీ సక్సెస్ మంత్రం," అని టెండూల్కర్ తెలిపారు.భువనేశ్వర్ కచ్చితత్వాన్ని కూడా సచిన్ మెచ్చుకున్నారు. ఆఫ్-స్టంప్ లేదా నాలుగో స్టంప్ లైన్‌పై బౌలింగ్ చేస్తూ, అక్కడి నుంచి ఐపీఎల్ 2026 ఫైనల్ ఆదివారం రాత్రి 7 గంటల నుంచి నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న నేపథ్యంలో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) పేసర్ భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌పై భారత క్రికెట్...