
ఇంటర్నెట్ డెస్క్: స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల అభిరుచులు మారుతున్నాయి. పెద్ద పెద్ద ఫోన్ల కంటే చేతిలో సులువుగా ఇమిడిపోయే కాంపాక్ట్ ఫోన్ల వైపు మొగ్గు చూపుతున్నారు (Compact smartphones). చిన్న డిస్ప్లే, పాకెట్లో ఇట్టే ఇమిడిపోయేలా, చేత్తో పట్టుకునేటప్పుడు సౌకర్యవంతంగా ఉండే స్మార్ట్‌ఫోన్‌ను కోరుకుంటున్నారు. వినియోగదారుల అభిరుచిని పసిగట్టిన కొన్ని కంపెనీలు ఈ మధ్య కాలంలో చిన్న సైజు ఫోన్లను విడుదల చేస్తున్నాయి. వీటి డిస్ప్లే కేవలం 6.3 అంగుళాలు లేదా అంతకన్నా తక్కువగానే ఉంటోంది. అలా మార్కెట్లో అందుబాటులో ఉన్న బుల్లిఫోన్ల సంగతులు ఇప్పుడు చూద్దాం.. యాపిల్ నుంచి వస్తున్న అతి చిన్న ఫోన్ iPhone 17e. ఇది కేవలం 6.1 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ డిస్ప్లేతో వస్తోంది. ఏ19 చిప్‌తో పనిచేస్తుంది. 48 ఎంపీ ప్రధాన కెమెరా+ 12 ఎంపీ ఫ్రంట్ కెమెరాతో వస్తున్న ఈ ఫోన్.. 256GB వేరియంట్ ధర రూ.64,900, 512GB వేరియంట్ ధర రూ.84,900. వివో నుంచి ఇటీవల కాలంలో లాంచ్ అయిన కాంపాక్ట్ ఫోన్ Vivo X300 FE. ఇందులో 6.31 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే ఉంది. ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్, 50 ఎంపీ ప్రధాన కెమెరా+ 50 ఎంపీ అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా+ 8ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా+ 50 ఎంపీ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. 6500ఎంఏహెచ్ బ్యాటరీ కలిగిన ఈ ఫోన్ ధర రూ.79,999 నుంచి ప్రారంభమవుతుంది. ఐఫోన్ నుంచి ఉన్న మరో ఆప్షన్ iPhone 17. ఇది 6.3 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ డిస్ప్లేతో వస్తోంది. యాపిల్ ఏ19 చిప్సెట్ ఉంది. 48 ఎంపీ ప్రధాన కెమెరా+ 40 ఎంపీ అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా+ 18ఎంపీ సెల్ఫీ కెమెరా ఐఫోన్ నుంచి ఉన్న మరో ఆప్షన్ iPhone 17. ఇది 6.3 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ డిస్ప్లేతో వస్తోంది. యాపిల్ ఏ19 చిప్సెట్ ఉంది. 48 ఎంపీ ప్రధాన కెమెరా+ 40 ఎంపీ అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా+ 18ఎంపీ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. 256GB వేరియంట్ ధర రూ.82,900, 512GB వేరియంట్ ధర రూ.1,02,900. కాస్త బడ్జెట్ ఎక్కువ పెట్టగలిగిన వారు దీన్ని పరిశీలించొచ్చు. గూగుల్ పిక్సెల్ ప్రియుల కోసం Google Pixel 9a అందుబాటులో ఉంది. ఇది 6.3 అంగుళాల డిస్ప్లే, టెన్సర్ జీ4 ప్రాసెసర్‌తో వస్తోంది. 48 ఎంపీ ప్రధాన కెమెరా+ 13 ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా+13 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంది. 5,100mAh బ్యాటరీ, 23W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇచ్చారు. 8GB RAM + 256GB వేరియంట్ ధర రూ.49,999. రూ.50 వేల బడ్జెట్లో కాంపాక్ట్ ఫోన్ కోరుకునే వారికి బెస్ట్ ఆప్షన్. ఒప్పో నుంచి రెనో సిరీస్‌లో Reno 15 Pro Mini 5G అందుబాటులో ఉంది. 6.32 అంగుళాల 1.5K ఎల్టీపీఎస్ అమోలెడ్ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 8450 ప్రాసెసర్. 200ఎంపీ ప్రధాన కెమెరా+ 50 ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా+ 50ఎంపీ పెరిస్కోప్ కెమెరా+ 50 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. 6,200mAh బ్యాటరీ, 80W వైర్డ్ ఛార్జింగ్ సదుపాయం కలిగిన ఈ ఫోన్ 12GB + 256GB వేరియంట్ ధర రూ.59,999. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in © 1999 - 2026 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved. Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted. This website follows the DNPA Code of Ethics. ఇంటర్నెట్ డెస్క్: స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల అభిరుచులు మారుతున్నాయి. పెద్ద పెద్ద ఫోన్ల కంటే చేతిలో సులువుగా ఇమిడిపోయే కాంపాక్ట్ ఫోన్ల వైపు మొగ్గు చూపుతున్నారు (Compact...