
Upcoming Smartphones : మే నెల ముగిసింది.. అనేక స్మార్ట్ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఇప్పుడు, జూన్ నెల వచ్చేస్తోంది. ఈ నెల మొదటి వారంలో మరెన్నో కొత్త స్మార్ట్ఫోన్లు మార్కెట్లోకి రానున్నాయి. అనేక టెక్ కంపెనీలు తమ అప్ కమింగ్ ఫోన్ల లాంచ్ తేదీలను ఇప్పటికే ప్రకటించాయి. హువావే, లావా, షావోమీ, మోటోరోలా వంటి బ్రాండ్లు అన్నీ ఈ నెల మొదటి వారంలో (Upcoming Smartphones) తమ కొత్త స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసేందుకు రెడీ అవుతున్నాయి. ఈ లైనప్‌లో ఫ్లాగ్షిప్-గ్రేడ్ డివైజ్‌ల నుంచి సరసమైన ధరల ఆప్షన్ల వరకు అన్నీ ఫోన్లు ఉంటాయి. ప్రస్తుతం కొత్త ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తుంటే.. ఈ జూన్ మొదటి వారంలో లాంచ్ అయ్యే ఫోన్లను జాబితాను ఓసారి పరిశీలిద్దాం.. హువావే నోవా 16 సిరీస్ : హువావే సరికొత్త నోవా 16 సిరీస్‌ను జూన్ 1న చైనాలో లాంచ్ చేస్తోంది. ఈ లైనప్‌లో హువావే నోవా 16, నోవా 16 ప్రో, నోవా 16z, నోవా 16 అల్ట్రా ఉంటాయని అంచనా. నివేదికల ప్రకారం.. నోవా 16 అల్ట్రాలో 6.84-అంగుళాల 1.5K ఎల్టీపీఓ అమోల్డ్ డిస్ప్లే, భారీ 7000mAh బ్యాటరీ, కిరిన్ 9000 సిరీస్ ప్రాసెసర్ ఉండవచ్చు. ఈ హువావే ఫోన్లో 50MP ప్రైమరీ కెమెరా, పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ కూడా ఉండే అవకాశం ఉంది. లావా బోల్డ్ N2 5జీ : భారతీయ బ్రాండ్ లావా కొత్త బడ్జెట్ 5జీ స్మార్ట్‌ఫోన్ తీసుకువస్తోంది. లావా బోల్డ్ N2 5జీ ఫోన్ జూన్ 3న లాంచ్ చేస్తోంది. ఈ కంపెనీ ‘నో నాన్సెన్స్ ఫోన్’గా క్యాంపెయిన్ చేస్తోంది. నివేదికల ప్రకారం.. ఈ ఫోన్లో 6.75-అంగుళాల HD+ ఎల్సీడీ డిస్ప్లే, Telugu » Technology » Upcoming Smartphones India Xiaomi 17t And Motorola Edge 70 Pro Plus To Go Official In Early June 2026 Upcoming Smartphones ( Image Credit : AI ) లావా బోల్డ్ N2 5జీ : భారతీయ బ్రాండ్ లావా కొత్త బడ్జెట్ 5జీ స్మార్ట్‌ఫోన్ తీసుకువస్తోంది. లావా బోల్డ్ N2 5జీ ఫోన్ జూన్ 3న లాంచ్ చేస్తోంది. ఈ కంపెనీ ‘నో నాన్సెన్స్ ఫోన్’గా క్యాంపెయిన్ చేస్తోంది. నివేదికల ప్రకారం.. ఈ ఫోన్లో 6.75-అంగుళాల HD+ ఎల్సీడీ డిస్ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్, 6000mAh బ్యాటరీ, 13MP కెమెరా వంటి ఫీచర్లు ఉంటాయని అంచనా. ఈ ఫోన్ ధర రూ. 13వేల లోపు ఉంటుందని అంచనా. బడ్జెట్ కేటగిరీలో అద్భుతమైన ఆప్షన్ అని చెప్పొచ్చు. Read Also : Nothing Phone 3 : పండగ చేస్కోండి.. రూ. 85వేల నథింగ్ ఫోన్ జస్ట్ రూ.49వేలకే.. ఇలాంటి డీల్ మళ్లీ రాదు! షావోమీ 17టీ : షావోమీ జూన్ ఫస్ట్ వీక్ అంటే.. జూన్ 4వ తేదీన షావోమీ 17Tని కూడా లాంచ్ చేస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.59-అంగుళాల FHD+ అమోల్డ్ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 8500 అల్ట్రా ప్రాసెసర్, 6500mAh బ్యాటరీ, 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందిస్తుంది. కెమెరా సెటప్‌లో లైకా బ్రాండెడ్ 50MP ప్రైమరీ కెమెరా, 50MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ 12MP అల్ట్రా-వైడ్ లెన్స్ ఉంటాయని అంచనా. ఈ ఫోన్ ప్రారంభ ధర సుమారు రూ. 65వేలు ఉంటుందని భావిస్తున్నారు. మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో ప్లస్ : ఈ లిస్టులో లాస్ట్ ఫోన్ మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో ప్లస్ ఫోన్.. జూన్ 4న లాంచ్ కానుంది. ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ ఎడ్జ్ 70 ప్రో ప్లస్ పేరుతో రానుంది. ఈ ఫోన్లో 6.8-అంగుళాల 144Hz అమోల్డ్ డిస్ప్లే, డైమెన్సిటీ 8500 ఎక్స్ట్రీమ్ చిప్సెట్, 6500mAh బ్యాటరీ వంటి ఫీచర్లు ఉంటాయని అంచనా. ఈ మోటోరోలా ఫోన్ 90W వైర్డ్ 15W వైర్లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ అందిస్తుంది. కెమెరా సెటప్‌లో మూడు 50MP సెన్సార్లు ఉంటాయని అంచనా. ఈ ఫోన్‌కు IP68,IP69,MIL-STD-810H సర్టిఫికేషన్లు ఉంటాయి. ధర సుమారు రూ. 50వేలు ఉంటుందని అంచనా. 10TV is a Telugu News and Current Affairs Channel owned by Spoorthi Communications Private Limited. Launched in March 2013, 10TV primarily caters to the Telugu TV audience in Telangana and Andhra Pradesh, with a strong news network in both states. Copyright 2025 © Developed by Veegam Software Pvt Ltd. Upcoming Smartphones : మే నెల ముగిసింది.. అనేక స్మార్ట్ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఇప్పుడు, జూన్ నెల వచ్చేస్తోంది. ఈ నెల మొదటి వారంలో మరెన్నో కొత్త స్మార్ట్ఫోన్లు మార్కెట్లోకి...