
IPL 2026 Final RCB Vs GT Live Score Updates: ఫైనల్ పోరులో టాస్ గెలిచి ఆర్సీబీ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో గుజరాత్ టైటాన్స్ మొదట ఇన్నింగ్స్ ఆరంభించనుంది. అశోక్ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది. Royal Challengers Bengaluru vs Gujarat Titans Live Score Updates: ఐపీఎల్ 2026 సీజన్‌కు క్లైమాక్స్‌కు చేరింది. ఫైనల్ పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), మాజీ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ (GT) జట్లు తలపడుతున్నాయి. రెండు టీమ్‌లలో ఎవరు గెలిచినా.. రెండోసారి ఐపీఎల్ విజేతగా నిలుస్తారు. క్వాలిఫైయర్-1 గెలిచి ఆర్సీబీ నేరుగా ఫైనల్లోకి ఎంట్రీ ఇవ్వగా.. క్వాలిఫైయర్-2లో రాజస్థాన్‌ను ఓడించి గుజరాత్ తుది పోరుకు అర్హత సాధించింది. సొంతగడ్డపై జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్సీబీని ఓడించి.. క్వాలిఫైయర్-1 ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవడంతోపాటు.. తమ ఫ్యాన్స్‌కు ట్రోఫీని గిఫ్ట్‌గా ఇవ్వాలని గుజరాత్ భావిస్తోంది. అద్భుతమైన ఆటతీరులో ఫైనల్‌కు చేరిన బెంగుళూరు.. తుది పోరులోనూ అదే జోరు కొనసాగించి వరుసగా రెండో ఏడాది ఛాంపియన్‌గా నిలవాలని చూస్తోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న ఈ ఫైనల్ మ్యాచ్‌పై క్రికెట్ అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. RCB vs GT Live Score Updates కోసం ఇక్కడ ఫాలో చేయండి. IPL 2026 Final RCB Vs GT Live Score Updates: ఫైనల్ పోరులో టాస్ గెలిచి ఆర్సీబీ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో గుజరాత్ టైటాన్స్ మొదట ఇన్నింగ్స్ ఆరంభించనుంది. అశోక్ క్రిందింటి జీ తెలుగు...