
పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ నివాసంలో తాజాగా ఏర్పాటు చేసిన సమావేశానికి మెజారిటీ ఎమ్మెల్యేలు గైర్హాజరైనట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. మొత్తం 80 మంది ఎమ్మెల్యేల్లో కేవలం 20 మంది హాజరైనట్టు సమాచారం. ఇంటర్నెట్ డెస్క్: ఇద్దరు తృణమూల్ ఎంపీలపై దాడులు జరిగిన నేపథ్యంలో పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఎమ్మెల్యేలు గైర్హాజరైనట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. మొత్తం 80 మంది ఎమ్మెల్యేల్లో కేవలం 20 మంది సమావేశానికి రావడంతో చివరకు మీటింగ్ రద్దైంది. ఇటీవలి ఘటనల నేపథ్యంలో ఎమ్మెల్యేలు బిజీగా ఉండటంతో రాలేకపోయారని టీఎంసీ పేర్కొంది. పార్టీ నేత శోభన్‌దేవ్ ఛటోపాధ్యాయ్ ఆధ్వర్యంలో మాజీ సీఎం మమత నివాసంలో ఈ మీటింగ్‌ను ఏర్పాటు చేశారు. కేవలం 20 మంది ఎమ్మెల్యేలే హాజరుకావడంతో మీటింగ్‌ను రద్దు చేయాల్సి వచ్చింది. గైర్హాజరైన ఎమ్మెల్యేలను ఫోన్లో సంప్రదించేందుకు ప్రయత్నించినా వారు అందుబాటులోకి రాలేదని సమాచారం. పార్టీ సీనియర్ నేతలు అనేక మంది ఈ సమావేశానికి రాలేదని తెలిసింది. అయితే, పార్టీలో కీలక నేతలుగా పేరున్న ఫర్హాద్ ఖాన్, నయన్ బంధోపాధ్యాయ్, మదన్ మిత్రా, అషిమా పాత్రా, కునాల్ ఘోష్ ఈ సమావేశానికి వచ్చినట్టు తెలిసింది. ఇటీవల ఎంపీలపై దాడుల నేపథ్యంలో ఎమ్మెల్యేలు బిజీగా ఉండి రాలేకపోయారని టీఎంసీ ప్రతినిధి మీడియాకు తెలిపారు. పాక్ కుట్ర.. ఉగ్రవాదులకు సాయంగా భారత్‌లోకి టెలికం సిగ్నల్స్ కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి Home » National » tmc meeting at mamata banerjee residence cancelled due to low attendance by mlas pcs ABN , Publish Date - May 31 , 2026 | 07:08 PM పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ నివాసంలో తాజాగా ఏర్పాటు చేసిన సమావేశానికి మెజారిటీ ఎమ్మెల్యేలు గైర్హాజరైనట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. మొత్తం 80 మంది...