
అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 పండుగ ముగింపు దశకు చేరుకుంది. రెండు నెలల పాటు హోరాహోరీగా సాగిన ఈ టోర్నమెంట్లో ఆఖరి అంకానికి రంగం సిద్ధమైంది. అహ్మదాబాద్‌లోని ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం నరేంద్ర మోదీ మైదానం వేదికగా జరుగుతున్న ఫైనల్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), గుజరాత్ టైటాన్స్ (జీటీ) జట్లు టైటిల్ కోసం తలపడుతున్నాయి. ఈ కీలక మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటీదార్ మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో గుజరాత్ టైటాన్స్ ముందుగా బ్యాటింగ్ చేయనుంది.టాస్ గెలిచిన అనంతరం ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటీదార్ మాట్లాడుతూ, "మేము ముందుగా బౌలింగ్ చేస్తాం. ఇది మంచి వికెట్, మ్యాచ్ సాగేకొద్దీ పెద్దగా మార్పులు ఉండవని భావిస్తున్నాం. గతేడాది ఇక్కడ మాకు మంచి జ్ఞాపకాలున్నాయి. ఈ మ్యాచ్ గెలవడానికి మా వంతు అత్యుత్తమ ప్రదర్శన చేస్తాం. ప్రస్తుతంపై దృష్టి పెట్టడం ముఖ్యం. మేము ఎలాంటి మార్పులు లేకుండా అదే జట్టుతో బరిలోకి దిగుతున్నాం" అని తెలిపాడు. గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ, "మేము కూడా ముందుగా బ్యాటింగ్ చేయాలనే అనుకున్నాం. ఇది మాకు అలవాటైన వికెట్. తొలి మూడు ఓవర్లలో ఫాస్ట్ బౌలర్లకు స్వింగ్ లభించే అవకాశం ఉంది. సాయి కిషోర్ స్థానంలో అర్షద్ ఖాన్‌ను జట్టులోకి తీసుకున్నాం" అని చెప్పాడు.ఇక పిచ్ విషయానికొస్తే, ఇది బ్యాటింగ్‌కు స్వర్గధామంగా ఉంటుందని క్యూరేటర్లు విశ్లేషించారు. ఎరుపు, నలుపు మట్టి మిశ్రమంతో తయారు చేసిన ఈ పిచ్‌పై అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 పండుగ ముగింపు దశకు చేరుకుంది. రెండు నెలల పాటు హోరాహోరీగా సాగిన ఈ టోర్నమెంట్లో ఆఖరి అంకానికి రంగం...