మంచి వార్తలను మీడియా సంస్థలు దేశ ప్రజలకు మరింత ఎక్కువగా చూపించాల్సిన అవసరం ఉందని.. ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు, మంచి పనులు, సక్సెస్ స్టోరీలను మీడియా ఎక్కువగా చూపించకపోతే.. యువత తప్పుదోవ పట్టే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. కేరళలో ప్రముఖ మలయాళ దినపత్రిక దీపిక 140వ వార్షికోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న సీపీ రాధాకృష్ణన్ .. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.సమాజంలో నిత్యం జరుగుతున్న సానుకూల పరిణామాలతోపాటు.. విజయగాథలు, సేవా కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయడం మీడియా బాధ్యత అని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. యూత్‌కు సరైన సమాచారాన్ని.. ఆదర్శవంతమైన వ్యక్తుల గురించి తెలియజేయకపోతే వారు తాత్కాలిక ట్రెండ్లు, అనవసరమైన అంశాల వైపు ఆకర్షితం అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. మంచి విషయాలను మీడియా బలంగా ప్రచారం చేయాలని.. లేకపోతే యువత ఆసక్తి కోల్పోయి బొద్దింకను ఫాలో అవుతుంది అంటూ వ్యాఖ్యానించారు.సీపీ రాధాకృష్ణన్ చేసిన బొద్దింక వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ‘ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)’ని ఉద్దేశించే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు రాజకీయ విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఒకరోజు హడావుడి చేసే అంశాలకు అతిగా ప్రచారం కల్పించడం సరైంది కాదని.. నిజంగా విలువైన విషయం అయితే వారం, 10 రోజులు లేదా నెల తర్వాత కూడా ప్రజలు గుర్తుంచుకుంటారని ఆయన.. కాక్రోచ్ జనతా పార్టీని ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు.ఇటీవల సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి బొద్దింకలు అంటూ చేసిన వ్యాఖ్యల చుట్టూ ఏర్పడిన వివాదం తర్వాత సోషల్ మీడియాలో ‘కాక్రోచ్ జనతా పార్టీ’ వెలుగులోకి వచ్చిన సంగతి మంచి వార్తలను మీడియా సంస్థలు దేశ ప్రజలకు మరింత ఎక్కువగా చూపించాల్సిన అవసరం ఉందని.. ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు, మంచి పనులు, సక్సెస్ స్టోరీలను మీడియా ఎక్కువగా చూపించకపోతే.. యువత తప్పుదోవ పట్టే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. కేరళలో ప్రముఖ మలయాళ దినపత్రిక దీపిక 140వ వార్షికోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న సీపీ రాధాకృష్ణన్ .. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.సమాజంలో నిత్యం జరుగుతున్న సానుకూల పరిణామాలతోపాటు.. విజయగాథలు, సేవా కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయడం మీడియా బాధ్యత అని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. యూత్‌కు సరైన సమాచారాన్ని.. ఆదర్శవంతమైన వ్యక్తుల గురించి తెలియజేయకపోతే వారు తాత్కాలిక ట్రెండ్లు, అనవసరమైన అంశాల వైపు ఆకర్షితం అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. మంచి విషయాలను మీడియా బలంగా ప్రచారం చేయాలని.. లేకపోతే యువత ఆసక్తి కోల్పోయి బొద్దింకను ఫాలో అవుతుంది అంటూ వ్యాఖ్యానించారు.సీపీ రాధాకృష్ణన్ చేసిన బొద్దింక వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ‘ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)’ని ఉద్దేశించే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు రాజకీయ విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఒకరోజు హడావుడి చేసే అంశాలకు అతిగా ప్రచారం కల్పించడం సరైంది కాదని.. నిజంగా విలువైన విషయం అయితే వారం, 10 రోజులు లేదా నెల తర్వాత కూడా ప్రజలు గుర్తుంచుకుంటారని ఆయన.. కాక్రోచ్ జనతా పార్టీని ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు.ఇటీవల సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి బొద్దింకలు అంటూ చేసిన వ్యాఖ్యల చుట్టూ ఏర్పడిన వివాదం తర్వాత సోషల్ మీడియాలో ‘కాక్రోచ్ జనతా పార్టీ’ వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. నిరుద్యోగం, పరీక్షా పత్రాల లీకేజీలు, విద్యా వ్యవస్థలో సమస్యలు వంటి అంశాలపై మీమ్స్, ట్రోల్స్, రాజకీయ వ్యంగ్య వ్యాఖ్యలతో యూత్‌లో ఈ కాక్రోచ్ జనతా పార్టీకి విశేషమైన ఆదరణ లభించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 22 మిలియన్లకు పైగా ఫాలోవర్లు రావడం సంచలనం రేపింది. అదే సమయంలో సమాజాన్ని నిర్మించడంలో నిర్మాణాత్మక జర్నలిజం (కన్స్ట్రక్టివ్ జర్నలిజం) కీలక పాత్ర పోషిస్తుందని సీపీ రాధాకృష్ణన్ స్పష్టం చేశారు. కరుణ, శాస్త్రీయ పురోగతి, పర్యావరణ పరిరక్షణ, సామాజిక సేవ, మానవ విజయాలను మీడియా ప్రముఖంగా ప్రోత్సహిస్తే సమాజంలో సానుకూల మార్పులు వస్తాయని సూచించారు. ప్రజల్లో విశ్వాసాన్ని పెంచడం, జాతీయాభివృద్ధికి ప్రేరణ కల్పించడం మీడియా ప్రధాన బాధ్యత అని గుర్తు చేశారు. మంచి వార్తలను మీడియా సంస్థలు దేశ ప్రజలకు మరింత ఎక్కువగా చూపించాల్సిన అవసరం ఉందని.. ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు, మంచి...