అల్లర్లు రేపిన సంబరాలు.. పారిస్ మొత్తం అల్లకల్లోలం ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో అల్లర్లు చెలరేగాయి. పారిస్ సెయింట్ జెర్మైన్-PSG అభిమానుల సంబరాలు తీవ్ర హింసాత్మకంగా మారాయి. చాంపియన్స్ లీగ్ ఫైనల్లో ఆర్సెనల్‌పై... పీఎస్జీ జట్టు సాధించిన చారిత్రాత్మక విజయాన్ని వేడుకగా జరుపుకోవడానికి... దాదాపు 20 వేల మంది అభిమానులు ప్రసిద్ధ చాంప్స్-ఎలిసీస్ వీధుల్లోకి తరలివచ్చారు. బుడాపెస్ట్‌లోని పుస్కాస్ ఎరీనాలో... శనివారం రాత్రి జరిగిన ఉత్కంఠభరితమైన ఫైనల్ మ్యాచ్‌లో... పీఎస్జి జట్టు పెనాల్టీ షూటౌట్లో... ఆర్సెనల్ను ఓడించి తన రెండవ చాంపియన్స్ లీగ్ టైటిల్‌ను... కైవసం చేసుకుంది. ఈ అద్భుత విజయం తర్వాత పారిస్ వీధుల్లో ఆర్క్ డి ట్రియోంఫ్ సమీపంలో... అభిమానులు భారీ ప్రదర్శనలు చేశారు. కార్ల హారన్లు మోగిస్తూ, పటాకులు కాలుస్తూ సంబరాల్లో మునిగిపోయారు. అయితే, కొద్దిసేపటికే ఈ సంబరాలు అదుపుతప్పి హింసకు దారితీశాయి. ఈ వార్తకు సంబంధించిన