
ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్!! పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్ ఇచ్చారు. వాషింగ్టన్: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ మరో కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని సోనార్‌పూర్‌లో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఆయనపై కొందరు గుడ్లు, రాళ్లు విసరడంతో కలకలం చెలరేగింది. నిరసనకారులు “చోర్ చోర్” అంటూ నినాదాలు చేశారు. అభిషేక్ బెనర్జీ రాకను వ్యతిరేకించారు. అభిషేక్ బెనర్జీపై జరిగిన దాడి కేసు దర్యాప్తులో కొత్త మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో May 31 2026 8:22 PM | Updated on May 31 2026 8:56 PM కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని సోనార్‌పూర్‌లో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఆయనపై కొందరు గుడ్లు, రాళ్లు విసరడంతో కలకలం చెలరేగింది. నిరసనకారులు “చోర్ చోర్” అంటూ నినాదాలు చేశారు. అభిషేక్ బెనర్జీ రాకను వ్యతిరేకించారు. అభిషేక్ బెనర్జీపై జరిగిన దాడి కేసు దర్యాప్తులో కొత్త మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో అరెస్టయిన పలువురు నిందితులకు సోనార్పూర్ మాజీ టీఎంసీ ఎమ్మెల్యే లవ్లీ మైత్రాతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటివరకు దాదాపు ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారిలో తపన్ మైతి, ఆకాశ్ గాయెన్, కాజల్ దాస్, దేవాశిష్ దత్తా, నిర్మాల్య సెంగుప్తా అలియాస్ జాయ్ ఉన్నారు. ఈ ఘటనలో వారి పాత్రలపై దర్యాప్తు జరుపుతున్నారు. తపన్ మైతి, జాయ్ సెంగుప్తా మాజీ ఎమ్మెల్యే లవ్లీ మైత్రాకు సన్నిహిత సహచరులు. కాజల్ దాస్, దేవాశిష్ దత్తా కూడా లవ్లీ మైత్రాతో అనుబంధం ఉన్నవారని తెలుస్తోంది. ఈ నలుగురూ కేసులో అరెస్టయిన వారిలో ఉన్నారు. ఆకాశ్ గాయెన్ ఎవరు? ఈ దాడి కేసులో అరెస్టయిన నిందితుల్లో ఆకాశ్ గాయెన్ ఒకరు. ఆయన స్థానిక తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్త.. తన కుమారుడు చాలా కాలంగా పార్టీలో పనిచేస్తున్నాడని, టీఎంసీ ఎన్నికల బూత్‌ల వద్ద క్రమం తప్పకుండా విధులు నిర్వహించేవాడని ఆయన తల్లి తెలిపారు. తన కుమారుడిపై వచ్చిన ఆరోపణలను ఆమె ఖండించారు. అభిషేక్ బెనర్జీపై ద్వేషం పెట్టుకునే కారణం ఆకాశ్‌కు లేదని చెప్పారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. దాడి ఘటన తర్వాత అతడు ఇంటికి వచ్చి, అనంతరం సమీప మైదానంలో ఫుట్‌బాల్ ఆడేందుకు వెళ్లాడు. అదే రాత్రి పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టుకు కచ్చితమైన కారణాలను కుటుంబానికి తెలియజేయలేదని ఆమె అన్నారు. ఆకాశ్ తండ్రి వ్యాన్-రిక్షా నడుపుతుండగా, ఆకాశ్ నిరుద్యోగి. జాయ్ సెంగుప్తా ఎవరు? ఈ కేసులో మరో ప్రధాన నిందితుడు జాయ్ సెంగుప్తా. ఆయన స్థానిక టీఎంసీ నాయకుడు. చాలా కాలంగా పార్టీలో కొనసాగుతున్నారు. దాడి కేసులో పోలీసులు ఆయనను అరెస్టు చేసినప్పటికీ, కుటుంబ సభ్యులు ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఆయనను తప్పుడు కేసులో ఇరికించారని ఆరోపించారు. సెంగుప్తా 1998 నుంచి తృణమూల్ కాంగ్రెస్‌తో అనుబంధంగా ఉన్నారని, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులు మారినా పార్టీ పట్ల విధేయత చూపారని కుటుంబ సభ్యులు తెలిపారు. అభిషేక్ బెనర్జీపై సెంగుప్తాకు ఎలాంటి అసంతృప్తి లేదని కూడా వారు స్పష్టం చేశారు. ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నందున అక్కడికి రావద్దని బెనర్జీకి సూచించాడని, అయినప్పటికీ పర్యటన జరిగిందని పేర్కొన్నారు. హింసాత్మక ఘటనలో సెంగుప్తాకు ఎలాంటి పాత్ర లేదని కుటుంబ సభ్యులు చెప్పారు. రాజకీయ ఆరోపణలు టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై జరిగిన దాడికి భారతీయ జనతా పార్టీ బాధ్యత వహించిందని ఆరోపించారు. బీజేపీ ఆ ఆరోపణలను తిరస్కరించింది. తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.