గుంటూరు జిల్లా, మే 31 (ఆంధ్రజ్యోతి): వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుపై తెలుగుదేశం పార్టీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు (TDP MP Lavu Sri Krishna Devarayalu) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగ డాక్యుమెంట్లతో దోచుకునేందుకు బ్రహ్మనాయుడు ప్రయత్నించారని ఫైర్ అయ్యారు. దొంగ జీవోలు తయారు చేసి హైడ్రాకు కూడా పంపారని ప్రస్తావించారు. ఈరోజు(ఆదివారం) గుంటూరు జిల్లాలో శ్రీకృష్ణ దేవరాయలు పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. చేసిన దొంగ పనిని కూడా బొల్లా బ్రహ్మనాయుడు ఒరిజినల్‌గా చిత్రీకరించే ప్రయత్నం చేశారని ఆగ్రహించారు. ఆ డాక్యుమెంట్లు తయారు చేసేందుకు డబ్బు సమకూర్చింది బ్రహ్మనాయుడేనని చెప్పుకొచ్చారు.

జలాలపురం, వినుకొండ టౌన్, బ్రాహ్మణపల్లిలో కూడా బొల్లా బ్రహ్మనాయుడు.. అమాయకులను బెదిరించి భూములు లాక్కున్నారని దుయ్యబట్టారు. తిరుమల డెయిరీ అమ్మి వారికి ఇచ్చిన ఎగ్రిమెంట్‌ను తప్పి మరలా డెయిరీ పెట్టి వారిని మోసం చేశారని మండిపడ్డారు. బ్రహ్మనాయుడు సంస్కారం లేకుండా మాట్లాడే వ్యక్తి అని ఆగ్రహించారు. అమాయక రైతుపై 307 కేసు పెట్టి జైలుకు పంపించాడని చెప్పారు. చట్టప్రకారం బ్రహ్మనాయుడుపై చర్యలు తీసుకుంటారని శ్రీకృష్ణ దేవరాయలు పేర్కొన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి...

విజయవాడలో ‘పెద్ది’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ముఖ్య అతిథిగా పవన్ కల్యాణ్..!

పోలీసులపై దాడులు సహించం.. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం: అనిత

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

గుంటూరు జిల్లా, మే 31 (ఆంధ్రజ్యోతి): వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుపై తెలుగుదేశం పార్టీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు (TDP MP Lavu Sri...