
టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీపై దాడి కేసులో అరెస్టైన నిందితుల్లో కొందరికి టీఎంసీ మాజీ ఎమ్మెల్యే లవ్లీ మైత్రాతో సంబంధాలు ఉన్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీపై దాడి కేసులో పోలీసులు ఇప్పటికే ఐదుగురిని అరెస్టు చేశారు. వీరికి టీఎంసీ మాజీ ఎమ్మెల్యే లవ్లీ మైత్రాతో సంబంధాలు ఉన్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. పోలీసులు అరెస్టు చేసిన తపన్ మైతీ, ఆకాశ్.. ఎంపీ అభిషేక్‌పై దాడి వీడియోల్లో కనిపించినట్టు సమాచారం. వీరికి టీఎంసీ మాజీ ఎమ్మెల్యే లవ్లీ మైత్రాతో దగ్గరి సంబంధాలు ఉన్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ కేసుకు సంబంధించి పోలీసుల అదుపులో ఉన్న నిర్మాల్యా సేన్‌గుప్తా, కాజల్ దాస్, దేబాశిష్ దత్తా కూడా టీఎంసీ నేత లవ్లీ మైత్రాతో సంబంధాలు ఉన్నట్టు తెలుస్తోంది. జాతీయ మీడియా కథనాల ప్రకారం, అకాశ్ స్థానికులకు టీఎంసీ కార్యకర్తగా పరిచయం. నిర్మాల్య సేన్ గుప్తాకు కూడా టీఎంసీతో సుదీర్ఘకాలంగా సంబంధం ఉందని తెలుస్తోంది.సేన్‌ను అక్రమంగా ఈ కేసులో ఇరికించారని ఆయన కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే, ఆయనకు 1998 నుంచి పార్టీతో అనుబంధం ఉందని తెలిపారు. ఈ దాడికి బీజేపీ కారణమని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. బీజేపీ మాత్రం ఈ ఆరోపణలను కొట్టిపారేస్తోంది. మాజీ సీఎం మమత ఇంట్లో మీటింగ్.. ఎమ్మెల్యేల డుమ్మా? పాక్ కుట్ర.. ఉగ్రవాదులకు సాయంగా భారత్‌లోకి టెలికం సిగ్నల్స్ Home » National » five arrested in attack on tmc mp abhishek banerjee links to former tmc mla emerge pcs ABN , Publish Date - May 31 , 2026 | 08:40 PM టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీపై దాడి కేసులో అరెస్టైన నిందితుల్లో కొందరికి టీఎంసీ మాజీ ఎమ్మెల్యే లవ్లీ మైత్రాతో సంబంధాలు ఉన్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇంటర్నెట్...