
Sobhita Dhulipala: నాగచైతన్యతో వివాహం తర్వాత అక్కినేని ఇంటి కోడలిగా మారిన శోభిత ధూళిపాళ్ల, గతంలో తమ పెళ్లిపై సోషల్ మీడియాలో జరిగిన చర్చలపై ఎట్టకేలకు స్పందించారు. సమంతతో విడాకుల తర్వాత చైతూ, శోభితను వివాహం చేసుకోవడంతో ఆ సమయంలో నెట్టింట పెద్ద ఎత్తున కామెంట్స్, ట్రోల్స్ వచ్చాయి. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో శోభిత తన వ్యక్తిగత జీవితంపై వచ్చిన ఆ విపరీతమైన అటెన్షన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. Sobhita Dhulipala: పెళ్లి తర్వాత శోభిత ఫస్ట్ మూవీ.. బర్త్‌డే స్పెషల్ ఫస్ట్‌లుక్ విడుదల తన వ్యక్తిగత విషయాలపై ప్రజల్లో ఆసక్తి ఉండటం సహజమేనని, అయితే తాను మాత్రం తనకు నచ్చినట్లే జీవిస్తున్నానని శోభిత(Sobhita Dhulipala) స్పష్టం చేశారు. జనాలు తన నుంచి ఏం ఆశిస్తున్నారో తనకు తెలియదని, ప్రస్తుతం తాను చాలా సంతోషంగా ఉన్నానని చెప్పారు. తన గురించి బయట ఎన్ని రకాల భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ, వాటన్నిటి మధ్య తానెప్పుడూ స్థిరంగా, ప్రశాంతంగా ఉండగలనని ఆమె నమ్మకంగా పేర్కొన్నారు. సమాజంలో నడిచే ఇలాంటి చర్చలను ఆమె వాతావరణంతో పోల్చారు. వెదర్ ఎప్పుడూ ఒకేలా ఉండదని, సమాజంలోని ఈ చర్చలు కూడా అంతేనని, ఇవేవీ శాశ్వతం కానప్పుడు వాటిని సీరియస్‌గా తీసుకోకూడదని శోభిత చెప్పుకొచ్చారు. వాతావరణం మారినట్లే తనపై వచ్చే కామెంట్స్ కూడా మారిపోతాయని, అందుకే ఆ సమయంలో వచ్చిన నెగెటివిటీని లేదా ట్రోల్స్‌ను తాను అస్సలు పట్టించుకోలేదని ఆమె పరోక్షంగా క్లారిటీ ఇచ్చారు. Telugu » Movies » Naga Chaitanya Wife Sobhita Dhulipala Interesting Comments On Trolling At Her Personal Life Naga Chaitanya wife Sobhita Dhulipala interesting comments on trolling at her personal life. 10TV is a Telugu News and Current Affairs Channel owned by Spoorthi Communications Private Limited. Launched in March 2013, 10TV primarily caters to the Telugu TV audience in Telangana and Andhra Pradesh, with a strong news network in both states. Copyright 2025 © Developed by Veegam Software Pvt Ltd. Sobhita Dhulipala: నాగచైతన్యతో వివాహం తర్వాత అక్కినేని ఇంటి కోడలిగా మారిన శోభిత ధూళిపాళ్ల, గతంలో తమ పెళ్లిపై సోషల్ మీడియాలో జరిగిన చర్చలపై ఎట్టకేలకు స్పందించారు. సమంతతో విడాకుల...