
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ ఫైనల్ సమరంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు సత్తా చాటారు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న తుదిపోరులో గుజరాత్ టైటాన్స్‌ను ఓ మోస్తరు స్కోరుకే పరిమితం చేశారు. వాషింగ్టన్ సుందర్ (50*) ఒంటరి పోరాటంతో హాఫ్ సెంచరీ చేయడంతో, గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ఆర్సీబీ బౌలర్లలో రసిఖ్ సలాం దార్ మూడు వికెట్లతో గుజరాత్ పతనాన్ని శాసించగా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీకి బౌలర్లు అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. పవర్ ప్లేలోనే గుజరాత్ ఓపెనర్లను పెవిలియన్‌కు పంపారు. ప్రమాదకర బ్యాటర్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (10) హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో ఔట్ కాగా, సాయి సుదర్శన్ (12) ను భువనేశ్వర్ కుమార్ వెనక్కి పంపాడు. దీంతో గుజరాత్ 26 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన నిశాంత్ సింధు (20), జోస్ బట్లర్ (19) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేసినా, ఆర్సీబీ బౌలర్ల కట్టుదిట్టమైన బంతులకు వేగంగా ఆడలేకపోయారు. రసిఖ్ సలాం, కృనాల్ పాండ్య వీరిద్దరినీ ఔట్ చేయడంతో గుజరాత్ స్కోరు బోర్డు నెమ్మదించింది. అర్షద్ ఖాన్ (6 బంతుల్లో 15) రెండు సిక్సర్లతో మెరుపులు మెరిపించినా ఎక్కువసేపు నిలవలేదు.ఒకవైపు వికెట్లు పడుతున్నా, వాషింగ్టన్ సుందర్ మాత్రం మరో ఎండ్‌లో ఒంటరి పోరాటం చేశాడు. చివరి వరకు క్రీజులో నిలిచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ ఫైనల్ సమరంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు సత్తా చాటారు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న తుదిపోరులో గుజరాత్...