
అహ్మదాబాద్: ఐపీఎల్ 2026 ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. వాషింగ్టన్ సుందర్ (50*; 37 బంతుల్లో) అర్ధ శతకంతో జట్టును ఆదుకున్నాడు. మిగతా బ్యాటర్లు చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. ఓపెనర్లు సాయి సుదర్శన్ (12), శుభ్‌మన్ గిల్ (10) విఫలమయ్యారు. వన్‌డౌన్‌లో వచ్చిన నిశాంత్ సింధు (20) పరుగులు చేసి వెనుదిరిగాడు. జోస్ బట్లర్ (19) కూడా క్రీజులో ఎక్కువసేపు నిలవలేకపోయాడు. అర్షద్ ఖాన్ (15) రన్స్ చేశాడు. ఆర్సీబీ బౌలర్లలో రసిఖ్ సలామ్ 3, జోష్ హేజిల్‌వుడ్ 2, భువనేశ్వర్ కుమార్ 2, కృనాల్ పాండ్య ఒక్కో వికెట్ పడగొట్టారు. తొలి రెండు ఓవర్లలో గుజరాత్ ఇన్నింగ్స్ సాఫీగానే సాగింది. ఈ క్రమంలో బంతిని అందుకున్న హేజిల్‌వుడ్ తన తొలి ఓవర్లోనే శుభ్‌మన్‌ను వెనక్కి పంపాడు. తర్వాత భువీ బౌలింగ్‌లో సాయి సుదర్శన్ భారీ షాట్‌కు యత్నించి వికెట్‌కీపర్ జితేశ్‌కు చిక్కాడు. బట్లర్, నిశాంత్ సింధు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేయడంతో గుజరాత్ కోలుకున్నట్లే కనిపించింది. కానీ, ఎనిమిదో ఓవర్లో రసిఖ్ సలామ్ నిశాంత్‌ను ఔట్ చేయడంతో స్కోరు వేగం నెమ్మదించింది. 9-12 ఓవర్ల మధ్య 18 పరుగులు మాత్రమే వచ్చాయి. దూకుడుగా ఆడలేకపోయిన బట్లర్.. కృనాల్ వేసిన 13 ఓవర్లో స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. అర్షద్ ఖాన్‌ను హేజిల్‌వుడ్ వెనక్కి పంపడంతో గుజరాత్ 14.1 ఓవర్లకు 99/5తో మరింత కష్టాల్లో పడింది. తర్వాత వచ్చిన రాహుల్ తెవాతియా (7) కూడా విఫలమయ్యాడు. చివరి మూడు ఓవర్లలో గుజరాత్ 34 పరుగులు చేసి రెండు వికెట్లు కోల్పోయింది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in © 1999 - 2026 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved. Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted. This website follows the DNPA Code of Ethics. అహ్మదాబాద్: ఐపీఎల్ 2026 ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155...