
జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Free Power To Farmers: ఉచిత విద్యుత్తు రద్దు కోసమే కాంగ్రెస్ మోటర్లకు మీటర్లను పెడుతుందని.. ప్రీపెయిడ్ మీటర్లతో విద్యుత్ రంగాన్ని ప్రైవేటుపరం చేయబోతున్నదని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వస్తే ఉచిత విద్యుత్తు పోతుందని ఆనాడే హెచ్చరించామని గుర్తుచేశారు. ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రీపెయిడ్ మీటర్లు రాబోతున్నాయని చెప్పారు. కాంగ్రెస్ కరెంటు కుట్రలను ప్రజలు వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. Also Read: AP Govt Holiday: సెలవులు ఇచ్చేయండి.. సెలవులపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ సమావేశంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌తో కలిసి పాల్గొన్న మాజీ మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. 'రాష్ట్రంలో ప్రీపెయిడ్ మీటర్లు తీసుకువచ్చేందుకు.. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్రంలో ఉన్న ఉచిత విద్యుత్‌ను ఎగొట్టేందుకు.. ప్రీపెయిడ్ మీటర్ల పేరుతో విద్యుత్ రంగాన్ని పూర్తిగా అదానీ వంటి ప్రైవేట్ సంస్థలకు అప్పజెప్పెందుకే రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు' అని కేటీఆర్ ఆరోపించారు. Also Read: Rajya Sabha Elections: తెలుగుదేశం పార్టీకి జోష్.. పెద్దల సభలో పెరగనున్న బలం మోటర్లకు మీటర్లు పెట్టి పూర్తిగా రైతన్నలకు ఉచిత విద్యుత్తును కాంగ్రెస్ ఎత్తగొట్టే కుట్ర చేస్తున్నదని రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. దీంతోపాటు ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రస్తుతం ఉన్న మీటర్లు తొలగించి ప్రీపెయిడ్ మీటర్లు పెట్టాలని కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 'నిన్న మంత్రివర్గంలో మీటర్లన్నింటినీ తొలగించి ప్రీపెయిడ్ మీటర్లు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. మొత్తం గ్రామాల్లో, పట్టణాల్లో వ్యవసాయాలకు ప్రీపెయిడ్ మీటర్లు వస్తాయి' అని చెప్పారు. మోటార్లకు మీటర్లు రాకముందే.. ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రీపెయిడ్ మీటర్లు తేకముందే కాంగ్రెస్ పార్టీ ఫ్యూజులు తీసివేయాలని మాజీ మంత్రి కేటీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ విద్యుత్ రంగంలో చేస్తున్న కరెంటు కుట్రలపైన తిరగబడాలని కోరారు. ఎన్నికలకు ముందే ప్రజలకు కాంగ్రెస్ వస్తే ఉచిత విద్యుత్ పోతుందని హెచ్చరించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మోటర్ల దగ్గర మీటర్లు వస్తాయని.. ప్రీపెయిడ్ మీటర్ల పేరుతో ప్రవేట్ సంస్థలకు విద్యుత్ రంగాన్ని అప్పజెప్తారని కేసీఆర్ హెచ్చరించారని కేటీఆర్ జ్ఞాపకం తెచ్చుకున్నారు. దేశవ్యాప్తంగా ప్రజలు వ్యతిరేకిస్తున్న ప్రీపెయిడ్ మీటర్లను కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో తీసుకురావడం దారుణమని రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రీపెయిడ్ మీటర్లు పెట్టాలని గతంలో నరేంద్ర మోదీ ఎంత ఒత్తిడి చేసినా.. రూ.30 వేల కోట్ల రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఆపినా కేసీఆర్ ఎదిరించారు, మీటర్లు పెట్టలేదని గుర్తుచేశారు. రానున్న మూడు నెలల్లోనే మొత్తం మీటర్లు పెడతామని చెప్పి నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. రానున్న మూడు నెలల్లోనే ఉన్న మీటర్లు పీకేసి, ప్రీపెయిడ్ మొబైల్స్ మాదిరి ప్రీపెయిడ్ కరెంట్ మీటర్లను తీసుకురాబోతున్నదని.. అయితే కాంగ్రెస్ ఉచిత కరెంట్‌ను ఎగొట్టడం కోసమే ప్రీపెయిడ్ మీటర్లను తీసుకువస్తుందని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. కేవలం ఉచిత విద్యుత్‌ను రద్దు చేయాలనే ఏకైక ఉద్దేశంతోనే అదానీ, అంబానీలకు విద్యుత్ సంస్థలను అప్పగించాలనే లక్ష్యంతోనే తెలంగాణ మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకున్నదని వివరించారు. కాంగ్రెస్ పార్టీపైన ప్రజలు తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారని.. ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు బలమైన గుణపాఠం కాంగ్రెస్ పార్టీకి చెప్తారని మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
Summary status: pending