రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘పెద్ది’. స్టార్ కాస్టింగ్ తో, టాప్ టెక్నిషియన్స్ తో భారీ స్థాయిలో రూపొందిన ఈ సినిమా.. మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ చిత్రంలో సీనియర్ నటుడు జగపతిబాబు కీలక పాత్ర పోషించారు. ప్రమోషన్స్ లో భాగంగా ఆయన పాత్రకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో తన గురించి వచ్చిన ఓ రూమర్ పై జగపతిబాబు ఘాటుగా స్పందించారు.పెద్ది సినిమాలో ఒక్క డైలాగ్ చెప్పడానికి 78 టేక్స్ తీసుకున్నట్లు బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే జగపతిబాబు కూడా ఓ సీన్ చేయడానికి ఏకంగా 72 టేక్స్ తీసుకున్నారని ఓ పుకారు వైరల్ అయింది. దీనిపై జగపతిబాబు తాజాగా క్లారిటీ ఇచ్చారు. నాన్ సెన్స్ అని కొట్టిపారేశాడు. సినిమా కోసం కష్టపడిన మాట వాస్తవమే కానీ, ఒక షాట్ కోసం అన్ని టేకులు తీసుకున్నారనే ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. తాను రెండు మూడు టేకుల కంటే ఎక్కువ తీసుకోనని, క్లైమాక్స్ లో నాలుగు నిమిషాల సన్నివేశం సింగిల్ టేక్ లో చేశానని ఆయన తెలిపారు.జగపతిబాబు మాట్లాడుతూ.. “షూటింగ్ లో డైలాగులు చెప్తున్నప్పుడు లిప్ సింక్ కాస్త అటు ఇటు అవుతుంది. జగపతిబాబు ఒక షాట్ కోసం 72 టేకులు తీసుకున్నాడని ఎవడో ప్రచారం చేశాడు. అదంతా నాన్ సెన్స్. పిచ్చి కుక్కలు ఏదోకటి వాగుతుంటాయి.. మొరుగుతూ ఉంటాయి. అవన్నీ నిజాలు ఎలా అవుతాయి. 72 టేక్స్ తీసుకున్నాడని అనడంలో అసలు అర్థం ఉందా!. మ్యాగ్జిమమ్ 3 టేక్స్ తీసుకుంటారు. నా సైడ్ నుంచి 2 టేక్స్ మాత్రమే రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘పెద్ది’. స్టార్ కాస్టింగ్ తో, టాప్ టెక్నిషియన్స్ తో భారీ స్థాయిలో రూపొందిన ఈ సినిమా.. మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ చిత్రంలో సీనియర్ నటుడు జగపతిబాబు కీలక పాత్ర పోషించారు. ప్రమోషన్స్ లో భాగంగా ఆయన పాత్రకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో తన గురించి వచ్చిన ఓ రూమర్ పై జగపతిబాబు ఘాటుగా స్పందించారు.పెద్ది సినిమాలో ఒక్క డైలాగ్ చెప్పడానికి 78 టేక్స్ తీసుకున్నట్లు బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే జగపతిబాబు కూడా ఓ సీన్ చేయడానికి ఏకంగా 72 టేక్స్ తీసుకున్నారని ఓ పుకారు వైరల్ అయింది. దీనిపై జగపతిబాబు తాజాగా క్లారిటీ ఇచ్చారు. నాన్ సెన్స్ అని కొట్టిపారేశాడు. సినిమా కోసం కష్టపడిన మాట వాస్తవమే కానీ, ఒక షాట్ కోసం అన్ని టేకులు తీసుకున్నారనే ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. తాను రెండు మూడు టేకుల కంటే ఎక్కువ తీసుకోనని, క్లైమాక్స్ లో నాలుగు నిమిషాల సన్నివేశం సింగిల్ టేక్ లో చేశానని ఆయన తెలిపారు.జగపతిబాబు మాట్లాడుతూ.. “షూటింగ్ లో డైలాగులు చెప్తున్నప్పుడు లిప్ సింక్ కాస్త అటు ఇటు అవుతుంది. జగపతిబాబు ఒక షాట్ కోసం 72 టేకులు తీసుకున్నాడని ఎవడో ప్రచారం చేశాడు. అదంతా నాన్ సెన్స్. పిచ్చి కుక్కలు ఏదోకటి వాగుతుంటాయి.. మొరుగుతూ ఉంటాయి. అవన్నీ నిజాలు ఎలా అవుతాయి. 72 టేక్స్ తీసుకున్నాడని అనడంలో అసలు అర్థం ఉందా!. మ్యాగ్జిమమ్ 3 టేక్స్ తీసుకుంటారు. నా సైడ్ నుంచి 2 టేక్స్ మాత్రమే తీసుకుంటాను. ఏమైనా అటు ఇటు అయితే మూడో టేక్ తీసుకుంటూనే తప్ప, అన్ని టేకులు ఎప్పుడూ తీసుకోలేదు. క్లైమాక్స్ లో 3 - 4 నిమిషాల సీన్ ఒక్క టేక్ లో చేసేశాను. కాబట్టి ఆ ప్రచారం నిజం కాదు” అని అన్నారు. 'పెద్ది' సినిమాలో అప్పలసూరి అనే పాత్రలో జగపతిబాబు కనిపించనున్నారు. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ ఆయన లుక్, గెటప్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్యారెక్టర్ తనకు రావడం అదృష్టంగా భావిస్తున్నానని.. తన కెరీర్ లో ప్రత్యేకంగా నిలిచిపోయే పాత్రల్లో అప్పలసూరి ఉంటుందని జగపతిబాబు చెబుతున్నారు. ఎమోషనల్గా, పెర్ఫార్మెన్స్ పరంగా, గెటప్ పరంగా అన్నింటిలోనూ తనకు చాలా నచ్చిన రోల్ ఇదని.. అందుకు క్రెడిట్ మొత్తం డైరెక్టర్ బుచ్చిబాబుకే చెందుతుందని అన్నారు.* ‘ఒసేయ్ రాములమ్మ’ సినిమా తీసి ప్రతీ హీరోకి భయం పుట్టించారు: మంచు మనోజ్పెద్దిలో రామ్ చరణ్ తండ్రిగా జగపతిబాబు కనిపిస్తారనే టాక్ వచ్చింది. అయితే తనది తండ్రి పాత్ర కాదని, పెద్దితో చాలా ప్రేమతో అనుబంధంతో ఉండే పాత్ర అని ఆయన క్లారిటీ ఇచ్చారు. రామ్ చరణ్ తో కలిసి నటించినందుకు చాలా హ్యాపీగా ఉందని, సినిమాలో తమ మధ్య బ్యూటీఫుల్ ఎమోషనల్ బాండింగ్ ఉంటుందని తెలిపారు. అప్పలసూరి పాత్ర ప్రేక్షకుల మదిలో నిలిచిపోతుందని జగపతిబాబు పేర్కొన్నారు. చరణ్ - జగపతిబాబు