
‘‘ఈ సల కప్ నమ్దే’’ అన్న నినాదం కాల క్రమంలో కామెడీగా మారిపోయి ఎంతో వేదనను అనుభవించిన ఆర్సీబీ ఫ్యాన్స్.. వరుసగా రెండేళ్లు ‘‘ఈ సలనూ కప్ నమ్దు’’ అంటూ మురిసిపోతున్నారిప్పుడు. గత ఏడాది సాధించిన విజయం గాలివాటం కాదని చాటిచెబుతూ వరుసగా రెండో కప్పుతో తన ఆధిపత్యాన్ని చాటింది బెంగళూరు. రజత్ పాటీదార్ నేతృత్వంలోని ఈ ఆర్సీబీ.. ఆషామాషీ జట్టు కాదనడానికి ఈ ఏడాది ప్రదర్శన తిరుగులేని రుజువు. వరుసగా తొమ్మిదేళ్ల పాటు కోహ్లి పోరాడాడు.. ఇంకో అరడజను మంది కెప్టెన్లు కలిసి వేర్వేరు సీజన్లలో ప్రయత్నించారు. కానీ ఎవ్వరూ బెంగళూరుకు కప్పు మాత్రం అందించలేకపోయారు. ఐపీఎల్ ఆరంభమైన రెండో ఏడాదే (2009) ఆర్సీబీ ఫైనల్ చేరింది. 2011, 2016లోనూ తుది పోరుకు అర్హత సాధించింది. కానీ ఒక్కసారీ ట్రోఫీని మాత్రం ముద్దాడలేకపోయింది. కోహ్లి నుంచి పగ్గాలందుకున్న డుప్లెసిస్ కూడా జట్టు రాత మార్చలేకపోవడంతో గత ఏడాది రజత్ పాటీదార్ లాంటి పెద్దగా పేరు లేని ఆటగాడిని కెప్టెన్‌ను చేసింది ఆర్సీబీ. మహా మహా ఆటగాళ్లే ఆర్సీబీ కల నెరవేర్చని నేపథ్యంలో పాటీదార్ మాత్రం ఏం చేస్తాడులే అనుకున్నారు చాలామంది. కానీ అతడి సారథ్యంలో బెంగళూరు అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించింది. లీగ్ దశలో ఆధిపత్యం చలాయించడమే కాక, ఫైనల్లోనూ నెగ్గి కప్పు కల నెరవేర్చుకుంది. అప్పుడు ఆర్సీబీ అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు. అయితే లేక లేక ఓ కప్పు నెగ్గిన ఆర్సీబీ.. ఇంకోసారి ఈ అద్భుతాన్ని పునరావృతం చేస్తుందన్న అంచనాలు ఎక్కువగా లేవు. కానీ గత సీజన్‌ను మించిన ఆటతీరుతో, మరింత ఆధిపత్యంతో ఈసారి కప్పు గెలిచింది బెంగళూరు. లీగ్ దశలో అగ్రస్థానంలో నిలవడమే కాక.. రెండో స్థానంలో నిలిచిన గుజరాత్‌ను వరుసగా తొమ్మిదేళ్ల పాటు కోహ్లి పోరాడాడు.. ఇంకో అరడజను మంది కెప్టెన్లు కలిసి వేర్వేరు సీజన్లలో ప్రయత్నించారు. కానీ ఎవ్వరూ బెంగళూరుకు కప్పు మాత్రం అందించలేకపోయారు. ఐపీఎల్ ఆరంభమైన రెండో ఏడాదే (2009) ఆర్సీబీ ఫైనల్ చేరింది. 2011, 2016లోనూ తుది పోరుకు అర్హత సాధించింది. కానీ ఒక్కసారీ ట్రోఫీని మాత్రం ముద్దాడలేకపోయింది. కోహ్లి నుంచి పగ్గాలందుకున్న డుప్లెసిస్ కూడా జట్టు రాత మార్చలేకపోవడంతో గత ఏడాది రజత్ పాటీదార్ లాంటి పెద్దగా పేరు లేని ఆటగాడిని కెప్టెన్‌ను చేసింది ఆర్సీబీ. మహా మహా ఆటగాళ్లే ఆర్సీబీ కల నెరవేర్చని నేపథ్యంలో పాటీదార్ మాత్రం ఏం చేస్తాడులే అనుకున్నారు చాలామంది. కానీ అతడి సారథ్యంలో బెంగళూరు అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించింది. లీగ్ దశలో ఆధిపత్యం చలాయించడమే కాక, ఫైనల్లోనూ నెగ్గి కప్పు కల నెరవేర్చుకుంది. అప్పుడు ఆర్సీబీ అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు. అయితే లేక లేక ఓ కప్పు నెగ్గిన ఆర్సీబీ.. ఇంకోసారి ఈ అద్భుతాన్ని పునరావృతం చేస్తుందన్న అంచనాలు ఎక్కువగా లేవు. కానీ గత సీజన్‌ను మించిన ఆటతీరుతో, మరింత ఆధిపత్యంతో ఈసారి కప్పు గెలిచింది బెంగళూరు. లీగ్ దశలో అగ్రస్థానంలో నిలవడమే కాక.. రెండో స్థానంలో నిలిచిన గుజరాత్‌ను క్వాలిఫయర్, ఫైనల్ మ్యాచ్‌ల్లో అలవోకగా ఓడించడం ఆర్సీబీ ఎంత మేటి జట్టుగా ఎదిగిందో చెప్పడానికి రుజువు. నడిపించిన నాయకుడు: నిరుడు బెంగళూరు జట్టులో అసాధారణ మార్పులేమీ జరిగిపోలేదు. అయినా ఆ జట్టు కప్పు గెలవగలిగిందంటే.. కెప్టెన్‌గా పాటీదార్ చూపించిన నైపుణ్యమే ముఖ్య కారణం. ఉన్న వనరులను సమర్థంగా ఉపయోగించుకోవడం ద్వారా అతను ఆర్సీబీ రాత మార్చాడు. ఈసారి కూడా అతను అదే పని చేశాడు. భువనేశ్వర్ లాంటి సీనియర్, రసిక్ సలామ్ లాంటి జూనియర్ నుంచి అత్యుత్తమ ప్రదర్శన రాబట్టుకోవడంలో పాటీదార్ ముద్ర స్పష్టం. ఆరంభంలో కొన్ని మ్యాచ్‌లకు హేజిల్‌వుడ్ లేకపోయినా.. బౌలింగ్ దళం ఆత్మవిశ్వాసం దెబ్బ తినకుండా చూసుకున్నాడు. తాత్కాలికంగా డఫీ సేవలను సమర్థంగా ఉపయోగించుకున్నాడు. పడిక్కల్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా దించడం, కృనాల్ పాండ్యను బ్యాటింగ్‌లోనూ తురుపుముక్కలా ప్రయోగించడంలోనూ పాటీదార్ నాయకత్వ నైపుణ్యాలను చూడొచ్చు. మ్యాచ్‌ల్లో బౌలింగ్ మార్పులు, ఫీల్డింగ్ ఏర్పాట్లలోనూ రజత్ తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఇక బ్యాటర్‌గా మిడిలార్డర్లో కీలక పాత్ర పోషిస్తూ జట్టును ముందుండి నడిపించాడు. క్వాలిఫయర్‌లో అతనెంత విలువైన ఇన్నింగ్స్‌లు ఆడాడో తెలిసిందే. ఒకవైపు నిలకడ.. ఇంకోవైపు విధ్వంసం: ఐపీఎల్ ఆరంభం నుంచి ఆర్సీబీకి ఎప్పుడూ బ్యాటింగే బలంగా ఉండేది. కానీ ఆ జట్టుకు అతి పెద్ద సమస్య.. కోహ్లి సహా కొందరు స్టార్ బ్యాటర్ల మీద ఎక్కువ ఆధారపడడం, సమష్టితత్వం లేకపోవడం. కానీ గత సీజన్లోనే ఆ బలహీనతను అధిగమించిన ఆర్సీబీ.. ఈసారి బ్యాటింగ్‌లో మరింత బలపడింది. కోహ్లి లాంటి నిలకడైన బ్యాటర్‌కు తోడు పడిక్కల్, పాటీదార్, సాల్ట్, వెంకటేశ్ అయ్యర్, టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్య లాంటి విధ్వంసకారులు తోడై ఆ జట్టు బ్యాటింగ్‌ను తిరుగులేని స్థాయికి తీసుకెళ్లారు. ఓ ఎండ్‌లో కోహ్లి యాంకర్ పాత్రను పోషిస్తుంటే.. మిగతా బ్యాటర్లు చెలరేగడం చాలా మ్యాచ్‌ల్లో చూశాం. అవసరమైనపుడు కోహ్లి సైతం