
భారత క్రికెట్ ప్రపంచంలో ఒక కొత్త సంచలనం ఆవిర్భవించింది. కేవలం 15 ఏళ్ల వయసులోనే, వైభవ్ సూర్యవంశీ అనే యువ కెరటం ఐపీఎల్ 2026 సీజన్‌ను తన అసాధారణ బ్యాటింగ్‌తో శాసించాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన ఈ కుర్రాడు, తన అద్వితీయ ప్రదర్శనతో రికార్డుల మోత మోగించాడు. సీజన్ ముగింపు వేడుకలో ఏకంగా ఐదు ప్రతిష్టాత్మక అవార్డులను గెలుచుకొని చరిత్ర సృష్టించాడు. ఆరెంజ్ క్యాప్ (అత్యధిక పరుగులు), మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్, ఎమర్జింగ్ ప్లేయర్, సూపర్ స్ట్రైకర్, సూపర్ సిక్సెస్ అవార్డులను కైవసం చేసుకున్నాడు.ఈ సీజన్లో వైభవ్ 776 పరుగులతో ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచాడు. అంతేకాకుండా ఒకే ఐపీఎల్ ఎడిషన్‌లో 72 సిక్సర్లు కొట్టి కొత్త రికార్డు నెలకొల్పాడు. 231.7 స్ట్రైక్ రేట్‌తో ఆధునిక క్రికెట్లోని మేటి బౌలర్లను సైతం అలవోకగా ఎదుర్కొన్నాడు. ఈ సీజన్లో 400, 500, 600 పరుగుల మైలురాళ్లను అత్యంత వేగంగా చేరుకున్న పిన్న వయస్కుడిగానూ ఘనత సాధించాడు. వైభవ్ బ్యాటింగ్ శైలిని, ఆట తీరును చూసి క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ సైతం ప్రశంసించాడు. అతడు భవిష్యత్తులో భారత టెస్ట్ జట్టుకు ఆడతాడని జోస్యం చెప్పాడు.అవార్డుల స్వీకరణ అనంతరం రవిశాస్త్రితో వైభవ్ మాట్లాడుతూ.. "అవార్డులు గెలవడం గర్వంగా ఉంది. కానీ, ఇలా ఇంటర్వ్యూలు ఇవ్వడమే కాస్త ఒత్తిడిగా అనిపిస్తోంది. బంతిని బలంగా బాదడమే నా నైజం. పరిస్థితులకు తగ్గట్టుగా ఆటను మార్చుకోవడం ఈ సీజన్లో నేర్చుకున్నాను" అని వివరించాడు.అయితే, సంజయ్ మంజ్రేకర్, మహ్మద్ కైఫ్ భారత క్రికెట్ ప్రపంచంలో ఒక కొత్త సంచలనం ఆవిర్భవించింది. కేవలం 15 ఏళ్ల వయసులోనే, వైభవ్ సూర్యవంశీ అనే యువ కెరటం ఐపీఎల్ 2026 సీజన్‌ను తన అసాధారణ బ్యాటింగ్‌తో శాసించాడు. రాజస్థాన్...