
ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్!! పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్ ఇచ్చారు. వాషింగ్టన్: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ మరో కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఐపీఎల్లో వరుసగా రెండు టైటిల్స్ నెగ్గిన కెప్టెన్లు గతంలో ఇద్దరు ఉన్నారు. అయితే మిగతా ఇద్దరిలో పోలిస్తే నాయకుడిగా రజత్ పాటీదార్ ప్రస్థానం ఎంతో భిన్నం. రెండు ట్రోఫీలు గెలిపించే సమయానికి ధోని దిగ్గజ కెప్టెన్‌గా గుర్తింపు పొంది రెండు ప్రపంచ కప్‌లు కూడా అందించాడు. రోహిత్ వరుసగా రెండు గెలవడానికి ముందే కెప్టెన్‌గా అతని ఖాతాలో మరో మూడు కప్‌లు Jun 1 2026 6:05 AM | Updated on Jun 1 2026 6:28 AM ఐపీఎల్లో వరుసగా రెండు టైటిల్స్ నెగ్గిన కెప్టెన్లు గతంలో ఇద్దరు ఉన్నారు. అయితే మిగతా ఇద్దరిలో పోలిస్తే నాయకుడిగా రజత్ పాటీదార్ ప్రస్థానం ఎంతో భిన్నం. రెండు ట్రోఫీలు గెలిపించే సమయానికి ధోని దిగ్గజ కెప్టెన్‌గా గుర్తింపు పొంది రెండు ప్రపంచ కప్‌లు కూడా అందించాడు. రోహిత్ వరుసగా రెండు గెలవడానికి ముందే కెప్టెన్‌గా అతని ఖాతాలో మరో మూడు కప్‌లు ఉన్నాయి. కానీ పాటీదార్ భారత్ తరఫున తన చివరి టెస్టును 2024లో, ఏకైక వన్డేను 2023లో ఆడాడు. ఆ తర్వాత మళ్లీ అతనికి టీమిండియా అవకాశం దక్కలేదు. గత ఏడాది పాటీదార్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసినప్పుడు అంతా ఆశ్చర్యపోయారు. మితభాషి, తన భావనలను ప్రదర్శించలేని అతను సారథిగా ఏం చేస్తాడు అని భావించారు. ద్రవిడ్, పీటర్సన్, కుంబ్లే, వెటోరి, కోహ్లిలాంటి దిగ్గజాల వల్ల సాధ్యం కాని భారం అతనిపై మోపినట్లు అనిపించింది. దాదాపు రెండేళ్ల క్రితం మొదటిసారి పాటీదార్‌ను కెప్టెన్‌గా చేయాలనే ఆలోచన వచ్చిప్పుడు ఆర్సీబీ డైరెక్టర్ బొబాట్, కోచ్ ఫ్లవర్ చిన్నపాటి ఇంటర్వ్యూ చేశారు. జట్టు పరిస్థితి బాగుపర్చేందుకు కెప్టెన్‌గా ఏం సూచిస్తావు అని అడిగారు. టీమ్ వాతావరణం, నమ్మకం, ముందుండి నడిపించడంలాంటి రొటీన్ మాటలు అతను చెప్పలేదు. ‘పదునైన పేస్ బౌలింగ్ బృందం కావాలి’ అని ఒకే ఒక్క మాటతో ముగించాడు. ముస్తాక్ అలీ ట్రోఫీలో కెప్టెన్‌గా మధ్యప్రదేశ్‌ను నడిపించిన తీరు చూసి కోహ్లి అనుమతితో వెంటనే పాటీదార్‌ను కెప్టెన్‌గా నియమించారు. స్టార్ ఆటగాడిగా గుర్తింపు లేదు. ప్రత్యేక ఆకర్షణగా ఎక్కడా కనిపించడు. టీమ్ సమావేశాల్లో కూడా గలగలా మాట్లాడే అలవాటు లేదు. కానీ ఒక్కసారి మైదానంలోకి దిగిన తర్వాతే అతనిలోని కెప్టెన్ బయటకు వస్తాడు. ఆ తర్వాత తాను స్వేచ్ఛగా పని చేస్తాడు. సొంతంగా నిర్ణయాలు తీసుకుంటాడు. ఈ లక్షణాలే అతని సారథ్యంపై నమ్మకం ఉంచేందుకు కారణం అయ్యాయని ఆర్సీబీ మేనేజ్మెంట్ వెల్లడించింది. ఆటగాడిగా కూడా అతను ఒక్కసారిగా ఐపీఎల్ వేదికపై దూసుకురాలేదు. 2021లో ఆర్సీబీ తరఫున 4 మ్యాచ్‌లలో 71 పరుగులే చేయడంతో తర్వాతి ఏడాది జట్టు అతడిని వదిలేసుకుంది. అయితే గాయంతో లవ్‌నీత్ తప్పుకోవడంతో అతని స్థానంలో 2022లో మళ్లీ చాన్స్ దక్కగా, లక్నోపై అద్భుత సెంచరీతో సత్తా చాటాడు. తర్వాతి సీజన్ గాయంతో దూరమైనా...గత ఏడాది కెప్టెన్‌గా అసాధారణ విజయాన్ని అందించాడు. తాజా సీజన్లో బ్యాటర్‌గా కూడా అతను విధ్వంసం సృష్టించాడు. 14 ఇన్నింగ్స్‌లలో 30 ఫోర్లు, 42 సిక్సర్లు సహా ఏకంగా 192.69 స్ట్రయిక్‌రేట్‌తో 501 పరుగులు నమోదు చేసి కోహ్లి తర్వాత రెండో స్థానంలో నిలిచాడు. ఆదివారమే ఫైనల్ ముగియగా... తన 33వ పుట్టిన రోజున అందుకున్న రెండో ట్రోఫీతో రజత్ పాటీదార్ తన పేరును ప్రత్యేకంగా లిఖించుకున్నాడు. చైతూ 'మై లేడీ'.. శోభిత 'బంగారం'.. బర్త్ డే స్పెషల్ (ఫొటోలు) ముగిసిన శ్రీ గోవిందరాజ స్వామివారి బ్రహ్మోత్సవాలు (ఫొటోలు) బేబీ జంట రొమాంటిక్ సాంగ్ స్టిల్స్ (ఫొటోలు) Best Photos Of