
ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్!! పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్ ఇచ్చారు. వాషింగ్టన్: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ మరో కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఐపీఎల్ 19వ సీజన్లో సత్తా చాటిన యంగ్ గన్స్ భవిష్యత్తుపై భరోసా పెంచుతున్న వైభవ్, అన్షుల్ ఒక్క ఇన్నింగ్స్‌తో వెలుగులోకి వచ్చిన ప్రఫుల్, ముకుల్ గత రెండు నెలలుగా మండు వేసవిలో నిండు వినోదం పంచిన ఐపీఎల్ 19వ సీజన్ ముగిసింది! ‘బేబీ బాస్’ వైభవ్ రికార్డులు తిరగరాస్తూ వీరబాదుడు బాదితే... అనామక అన్షుల్ ‘పర్పుల్ క్యాప్’ రేసులో చివరి వరకు Jun 1 2026 6:18 AM | Updated on Jun 1 2026 6:45 AM గత రెండు నెలలుగా మండు వేసవిలో నిండు వినోదం పంచిన ఐపీఎల్ 19వ సీజన్ ముగిసింది! ‘బేబీ బాస్’ వైభవ్ రికార్డులు తిరగరాస్తూ వీరబాదుడు బాదితే... అనామక అన్షుల్ ‘పర్పుల్ క్యాప్’ రేసులో చివరి వరకు నిలిచాడు! జోఫ్రా ఆర్చర్ తన పేస్ పవర్ తగ్గలేదని నిరూపించుకుంటే... రబాడ తానెంత ప్రమాదకర బౌలరో మరోసారి చాటాడు! ఐదేసిసార్లు ఐపీఎల్ ట్రోఫీ నెగ్గిన చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ సీజన్ ఆసాంతం పరాజయాలతో సహవాసం చేయగా... లక్నో సూపర్ జెయింట్స్‌ను నడిపించలేక రిషభ్ పంత్ నాయకత్వ బాధ్యతలకు రాం రాం చెప్పాడు! చెన్నై భారీ ధర పెట్టిన కార్తీక్, ప్రశాంత్ పెద్దగా ఆకట్టుకోలేకపోగా... హైదరాబాద్ కొత్త పేసర్లు ప్రఫుల్, సాకిబ్ లీగ్‌పై తమదైన ముద్ర వేశారు! ఢిల్లీ హార్డ్ హిట్టర్ సమీర్ రిజ్వీ మెరుపులు ఆరంభ మ్యాచ్‌లకే పరిమితమైతే... లక్నో పించ్‌హిట్టర్ ముకుల్ ఒక్క ఇన్నింగ్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు! అంతర్జాతీయ టి20లకు వీడ్కోలు పలికినా తన పరుగుల దాహం తీరలేదని కోహ్లి నిరూపించుకుంటే... లయ దొరకబుచ్చుకోలేక సూర్యకుమార్, హార్దిక్ విమర్శల పాలయ్యారు! వెస్టిండీస్ ప్లేయర్ల విధ్వంసకర విన్యాసాలు కొన్ని మ్యాచ్‌లకే పరిమితం కాగా... అన్క్యాప్డ్ ప్లేయర్ల మెరుపులు భారత బెంచ్ బలాన్ని చాటాయి! టెస్టు ప్లేయర్లుగా ముద్రపడ్డ ఆటగాళ్లు ఆరెంజ్, పర్పుల్ క్యాప్ రేసులో ముందుంటే.. దేశవాళీల్లో రాణించిన అఖీబ్ నబీ ఐపీఎల్లో అదే జోరు కనబర్చలేకపోయాడు! ఇలా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ సీజన్లో జరిగిన కొన్ని కీలక అంశాలపై ఓ కన్నేస్తే... 10 జట్లు, 65 రోజులు, 74 మ్యాచ్‌లు, వందలకొద్దీ రికార్డులు, వేలాది బౌండరీలు... ఇలా వేసవిలో మస్తు మజా పంచిన ఐపీఎల్–19వ సీజన్ ఎప్పటిలాగే కోట్లాది మంది అభిమానాన్ని చూరగొంది. దినదిన ప్రవర్ధమానంగా దూసుకెళ్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్... ఈసారి కూడా ఎందరో యువ ఆటగాళ్లను అందలం ఎక్కించింది. బ్యాటింగ్‌కు అనుకూలమైన నిబంధనల కారణంగా భారీ స్కోర్లు నమోదయ్యాయనే అపవాదు ఉన్నా... ఈ సీజన్లో పరుగుల వరద పారిందనేది వాస్తవం. 200 స్కోరు సాధారణం అయిపోయిన తరుణంలో... రాజస్తాన్ రాయల్స్ తమ పదునైన బౌలింగ్‌తో 159 పరుగుల మ్యాచ్‌లో 40 పరుగుల తేడాతో విజయం సాధించడం విశేషం. మొహమ్మద్ షమీ తొలి బంతికి వికెట్ తీసే అలవాటును కొనసాగించగా... ప్రిన్స్ యాదవ్ తన వేగంతో టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. 264 పరుగులు చేసి కూడా ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ గెలవలేకపోగా... అంత పెద్ద లక్ష్యాన్ని పంజాబ్ మరో 7 బంతులుండగానే ఛేదించి ‘వావ్’ అనిపించింది. గత సీజన్లోనే మెరుపు సెంచరీతో వెలుగులోకి వచ్చిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఈ ఏడాది నిలకడైన బాదుడుతో ప్రపంచవ్యాప్తంగా తనపేరు మారుమోగేలా చేసి భారత సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. ‘టెస్టు’ ప్లేయర్ల సత్తా... అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ ఎందులో తీసుకున్న టెస్టు ప్లేయర్లే ఐపీఎల్లో తమదైన ముద్ర వేశారు. బౌలింగ్‌లో రబాడ, ఆర్చర్, భువనేశ్వర్ విజృంభిస్తే... బ్యాటింగ్‌లో శుబ్‌మన్ గిల్,