Punjab CM Bhagwant Mann : ప్రజాస్వామ్యంలో పాలకులను ప్రశ్నించే తత్వమే వ్యవస్థల్లో మార్పులు తీసుకు వస్తుందని పంజాబ్లో జరిగిన ఒక ఆసక్తికర సంఘటన నిరూపించింది. లైవ్ ప్రోగ్రామ్లో ముఖ్యమంత్రి విద్యా విధానాన్ని ఒక పాఠశాల విద్యార్థిని ధైర్యంగా తప్పుపట్టడం, దానికి సీఎం సానుకూలంగా స్పందించి తక్షణమే దశాబ్దాల నాటి పాత నిబంధనను మారుస్తూ ఆదేశాలు జారీ చేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఆ చిన్నారి ఏం ప్రశ్న అడిగింది, వెంటనే సీఎం కూడా విద్యావిధానంలో మార్పులు ఎందుకు తెచ్చారో మనం ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 'సితారే జమీన్ తే' వేదికగా ఊహించని ప్రశ్న..పంజాబ్ స్టేట్ బోర్డ్ పరిధిలోని 8, 10, 12వ తరగతుల బోర్డు పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి, టాప్ ర్యాంకులు సాధించిన విద్యార్థులను గౌరవించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం 'సితారే జమీన్ తే' అనే ప్రత్యేక సత్కార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకలో ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రతిభావంతులైన విద్యార్థులతో నేరుగా ముఖాముఖి నిర్వహించారు. ఈ క్రమంలోనే అమృత్సర్కు చెందిన ఒక విద్యార్థిని లేచి నిలబడి.. ముఖ్యమంత్రిని ఉద్దేశించి అడిగిన ప్రశ్నతో సభా ప్రాంగణమంతా ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. "సీఎం గారూ.. మేమందరం ఒకే క్లాసులో చదువుకుంటాం. పరీక్షల కోసం అందరం సమానంగా రాత్రింబవళ్లు కష్ట పడతాం. మమ్మల్ని తీర్చిదిద్దడంలో మా ఉపాధ్యాయులు కూడా అంతే కృషి చేస్తారు. అలాంటప్పుడు.. పరీక్షల్లో ముగ్గురికి ఒకే రకమైన మార్కులు వచ్చినప్పుడు.. కేవలం వయసును ప్రామాణికంగా తీసుకుని ఒకరికి మొదటి ర్యాంకు, మిగిలిన వారికి రెండు, మూడు స్థానాలు ఎలా కేటాయిస్తారు? ఇది ఎంత వరకు న్యాయం?" అని ఆ బాలిక నిలదీసింది. విద్యార్థిని అడిగిన ఈ లాజికల్ ప్రశ్నకు Punjab CM Bhagwant Mann : ప్రజాస్వామ్యంలో పాలకులను ప్రశ్నించే తత్వమే వ్యవస్థల్లో మార్పులు తీసుకు వస్తుందని పంజాబ్లో జరిగిన ఒక ఆసక్తికర సంఘటన నిరూపించింది. లైవ్ ప్రోగ్రామ్లో ముఖ్యమంత్రి విద్యా విధానాన్ని ఒక పాఠశాల విద్యార్థిని ధైర్యంగా తప్పుపట్టడం, దానికి సీఎం సానుకూలంగా స్పందించి తక్షణమే దశాబ్దాల నాటి పాత నిబంధనను మారుస్తూ ఆదేశాలు జారీ చేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఆ చిన్నారి ఏం ప్రశ్న అడిగింది, వెంటనే సీఎం కూడా విద్యావిధానంలో మార్పులు ఎందుకు తెచ్చారో మనం ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 'సితారే జమీన్ తే' వేదికగా ఊహించని ప్రశ్న..పంజాబ్ స్టేట్ బోర్డ్ పరిధిలోని 8, 10, 12వ తరగతుల బోర్డు పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి, టాప్ ర్యాంకులు సాధించిన విద్యార్థులను గౌరవించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం 'సితారే జమీన్ తే' అనే ప్రత్యేక సత్కార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకలో ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రతిభావంతులైన విద్యార్థులతో నేరుగా ముఖాముఖి నిర్వహించారు. ఈ క్రమంలోనే అమృత్సర్కు చెందిన ఒక విద్యార్థిని లేచి నిలబడి.. ముఖ్యమంత్రిని ఉద్దేశించి అడిగిన ప్రశ్నతో సభా ప్రాంగణమంతా ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. "సీఎం గారూ.. మేమందరం ఒకే క్లాసులో చదువుకుంటాం. పరీక్షల కోసం అందరం సమానంగా రాత్రింబవళ్లు కష్ట పడతాం. మమ్మల్ని తీర్చిదిద్దడంలో మా ఉపాధ్యాయులు కూడా అంతే కృషి చేస్తారు. అలాంటప్పుడు.. పరీక్షల్లో ముగ్గురికి ఒకే రకమైన మార్కులు వచ్చినప్పుడు.. కేవలం వయసును ప్రామాణికంగా తీసుకుని ఒకరికి మొదటి ర్యాంకు, మిగిలిన వారికి రెండు, మూడు స్థానాలు ఎలా కేటాయిస్తారు? ఇది ఎంత వరకు న్యాయం?" అని ఆ బాలిక నిలదీసింది. విద్యార్థిని అడిగిన ఈ లాజికల్ ప్రశ్నకు అక్కడున్న వారంతా ఫిదా అయిపోయారు. సభలో ఉన్నవారంతా ఒక్కసారిగా చప్పట్ల కొట్టారు.స్పందించిన ముఖ్యమంత్రి.. నిబంధనలు మార్పు!విద్యార్థిని ప్రశ్నకు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఎంతగానో ముగ్ధులయ్యారు. ఆమె అడిగిన దాంట్లో వంద శాతం న్యాయం ఉందని భావించిన ఆయన.. తక్షణమే వేదికపైనే కీలక నిర్ణయం తీసుకున్నారు. "మా దృష్టిలో సమాన మార్కులు సాధించిన మీ ముగ్గురిదీ తొలి స్థానమే" అని సీఎం ఆ బాలికకు హామీ ఇచ్చారు. అంతటితో ఆగకుండా.. బోర్డు పరీక్షల్లో సమాన మార్కులు సాధించిన విద్యార్థులు అందరికీ సంయుక్తంగా ఒకే మొదటి ర్యాంకును కేటాయించాలని అక్కడే ఉన్న విద్యాశాఖ ఉన్నతాధికారులను సీఎం భగవంత్ మాన్ ఆదేశించారు. ఇకపై కేవలం మార్కులను మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలని, వయసు ఆధారంగా ర్యాంకులు మార్చే పాత విధానానికి స్వస్తి పలకాలని స్పష్టం చేశారు. అనంతరం ఆ బాలికను అభినందించి, విద్యార్థులందరితో కలిసి సీఎం సరదాగా ఫొటోలు దిగారు.విధానం తప్పు అని చెప్పడం సంతోషకరమంటూ..ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా కూడా ఈ ఉదంతంపై ప్రత్యేకంగా స్పందించారు. ఒక ముఖ్యమంత్రి ముందు నిలబడి.. ‘మీ ప్రభుత్వ విధానం తప్పు’ అని ఒక చిన్న పిల్ల నిలదీసి చెప్పడాన్ని, దాన్ని సీఎం అంతే హుందాగా స్వీకరించి మార్చడాన్ని చూడడం దేశ విద్యా వ్యవస్థలోనే ఒక గొప్ప పరిణామమని