ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 ఫైనల్ ఓటమితో నిరాశలో ఉన్న గుజరాత్ టైటాన్స్ టీమ్‌కు మరో షాక్ తగిలింది. ఫైనల్ మ్యాచ్ అనంతరం అహ్మదాబాద్ స్టేడియం నుంచి హోటల్‌కు తిరుగు ప్రయాణమైన బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటన ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. దీంతో వెంటనే ప్లేయర్లు, సహాయక సిబ్బంది బస్సులో నుంచి దిగిపోయారు. అదృష్టవశాత్తు అందరూ సురక్షితంగా బయటపడ్డారు. బస్సులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించినట్లు సమాచారం. జట్టు సభ్యులు దాదాపు గంటసేపు రోడ్డుపైనే వేచి ఉండాల్సి వచ్చింది. మరో బస్సు ఏర్పాటు చేసి క్షేమంగా ప్లేయర్లను, సిబ్బందిని హోటల్‌కు పంపించారు.

ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2026 ఫైనల్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై గుజరాత్ టైటాన్స్ జట్టు 5 వికెట్ల తేడాతో ఓడిన సంగతి తెలిసిందే. దీంతో రెండోసారి కప్పు అందుకోవాలన్న కల జీటీకి కలగానే మిగిలిపోయింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్.. 155/8 స్కోరుకే పరిమితం అయింది. ఛేదనలో ఆర్సీబీ 18 ఓవర్లలోనే ఆటను ముగించి వరుసగా రెండోసారి ట్రోఫీని ముద్దాడింది. ఫైనల్లో ఓటమి బాధ నుంచి కోలుకోకముందే బస్సు ప్రమాదం భయాందోళనకు గురిచేసినప్పటికీ.. టీమ్ అంతా క్షేమంగా ఉండటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఇవి కూడా చదవండి:

ఇషాన్ కిషన్‌ను దాటి అత్యధిక ధర పలికిన ఎంఐ ప్లేయర్

ఐపీఎల్ ఫైనల్: కోహ్లీ గత రికార్డులు ఎలా ఉన్నాయంటే..

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 ఫైనల్ ఓటమితో నిరాశలో ఉన్న గుజరాత్ టైటాన్స్ టీమ్‌కు మరో షాక్ తగిలింది. ఫైనల్ మ్యాచ్...