
టెక్ దిగ్గజం ఆపిల్ నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న స్మార్ట్ గ్లాసెస్ విడుదల మరింత ఆలస్యం కానుంది. సాంకేతిక, అభివృద్ధిపరమైన సవాళ్ల కారణంగా వీటి లాంచ్‌ను 2027 చివరికి వాయిదా వేసినట్లు తాజా నివేదికలు చెబుతున్నాయి. కేవలం స్మార్ట్ గ్లాసెస్ విభాగంలోనే కాకుండా, ఆపిల్ వాచ్ తరహాలోనే సాధారణ కళ్లజోళ్ల మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని వీటిని తీసుకురావాలని కంపెనీ వ్యూహం రచిస్తోంది.బ్లూమ్‌బెర్గ్ ప్రతినిధి మార్క్ గర్మన్ తన ‘పవర్ ఆన్’ న్యూస్లెట్టర్లో ఈ వివరాలను వెల్లడించారు. అంతర్గతంగా 'N50' కోడ్‌నేమ్‌తో అభివృద్ధి చెందుతున్న ఈ గ్లాసెస్‌ను వాస్తవానికి 2026 చివర్లో ఆవిష్కరించి, 2027 ప్రారంభంలో మార్కెట్లోకి తీసుకురావాలని ప్లాన్ చేశారు. కానీ తాజా జాప్యంతో వీటి విడుదల 2027 చివరి నాటికి జరగనుంది. కంపెనీ సీఈవో టిమ్ కుక్ పదవీ విరమణకు ముందు ఈ ప్రాజెక్టుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు.ఫీచర్లు.. ధర వివరాలుతొలి వెర్షన్ స్మార్ట్ గ్లాసెస్‌లో లెన్స్‌లోనే కనిపించే అగుమెంటెడ్ రియాలిటీ (AR) డిస్ప్లేలు ఉండవని తెలుస్తోంది. బదులుగా, రోజువారీ అవసరాలకు ఉపయోగపడే ఫీచర్లపై దృష్టి సారించారు. ఫోటోలు, వీడియోలు తీయడానికి ఓవల్ ఆకారంలో కెమెరాలు, కాల్స్ మాట్లాడటానికి, సంగీతం వినటానికి, సిరితో మాట్లాడటానికి మైక్రోఫోన్లు, స్పీకర్లు ఉంటాయి. ఆపిల్ ఇంటెలిజెన్స్ సాయంతో నడక దారులను చూపించడం వంటి సదుపాయాలు కూడా ఉండనున్నాయి.రే-బాన్ వేఫేరర్, ఇతర స్లిమ్ డిజైన్ల వంటి పలు ఫ్రేమ్ స్టైల్స్‌ను ఆపిల్ పరీక్షిస్తోంది. వీటి ధర 200 నుంచి 500 డాలర్ల (సుమారు రూ. 16,000 నుంచి రూ. 42,000) మధ్య టెక్ దిగ్గజం ఆపిల్ నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న స్మార్ట్ గ్లాసెస్ విడుదల మరింత ఆలస్యం కానుంది. సాంకేతిక, అభివృద్ధిపరమైన సవాళ్ల కారణంగా వీటి లాంచ్‌ను 2027 చివరికి వాయిదా...