
జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Extramarital Affair Crime: భర్తతో వివాహమై ఇద్దరు పిల్లలు కలిగిన తర్వాత భార్య వేరొకరితో వివాహేతర సంబంధం ఏర్పరచుకుంది. ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తను వదిలేయాలని చూసింది. తమ బంధానికి అడ్డుగా ఉన్నాడని భావించి ప్రియుడితో కలిసి భర్త హత్యకు ప్రణాళిక రచించింది. భర్తను ఫుల్లుగా తాగించి మద్యం మత్తులో ఉండడంతో అతడిని ప్రియుడితో కలిసి భార్య హత్య చేసింది. భర్త మృతదేహాన్ని అతడి సొంత పొలంలోనే జేసీబీతో గుంతలో పూడ్చివేసింది. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన ముత్యంరెడ్డికి, భార్య కల్పన ఉంది. వీరిద్దరికీ టీనేజ్ కలిగిన పిల్లలు ఉన్నారు. భర్త రోజువారీ వ్యవసాయ పనులు చేస్తుండేవాడు.. భార్య ఓ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. ఆమెకు మానూరు మండలం ఎల్గోయి గ్రామానికి చెందిన గైనీ పండరితో పరిచయమైంది. ఆ పరిచయం కాస్త వారిద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. తరచూ వీరిద్దరూ కలుసుకునేవారు. ఈ క్రమంలో తమ బంధానికి ముత్యంరెడ్డి అడ్డుగా ఉన్నాడని భావించారు. అతడి అడ్డు తొలగించుకుంటే హాయిగా తామిద్దరం కలిసి జీవించవచ్చనే భావన ఏర్పడింది. ఒకరోజు భర్త ముత్యంరెడ్డికి భార్య పీకలదాకా మద్యం తాగించింది. అనంతరం హత్య చేసి భర్త పొలంలోనే మృతదేహాన్ని జేసీబీ సహాయంతో పూడ్చిపెట్టారు. ఎవరికీ అనుమానం రాకుండా పూడ్చిపెట్టిన ప్రాంతంలో రాళ్లు పెట్టారు. అయితే తొమ్మిది రోజులుగా ముత్యంరెడ్డి కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు నారాయణఖేడ్ పోలీసులను ఆశ్రయించారు. భర్త కనిపించడం లేదని భార్య మిస్సింగ్ కేసు పెట్టింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా భార్య కల్పనపై పోలీసులు అనుమానం వ్యక్తం చేసి తమదైన విచారణ చేశారు. ఆమెతో పోలీసులు విస్తుగొలిపే నిజాలు బయటపెట్టారు. ఆమెతోపాటు ప్రియుడు పండరిని అదుపులోకి తీసుకుని విచారించారు. తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా మారుతున్నాడనే కారణంతోనే ముత్యంరెడ్డిని హత్య చేసినట్లు భార్యతోపాటు ఆమె ప్రియుడు పండరి పోలీసుల విచారణలో అంగీకరించారు. ఈ ఘటన నారాయణఖేడ్ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల అధికారిక ప్రకటన అనంతరం వెల్లడి కానున్నాయి.
Summary status: pending