
విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. Gujarat Titans Bus Fire Accident:ప్రాథమిక సమాచారం ప్రకారం బస్సులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించాయి. ముందుగా పొగ రావడం గమనించిన సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. దీంతో ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది మరియు ఇతర సిబ్బందిని వెంటనే బస్సు నుంచి బయటకు దించారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. బస్సులో ఉన్న అందరూ సురక్షితంగా బయటపడినట్లు సమాచారం. అయితే పొగ ఎక్కువగా వ్యాపించడంతో కొంతసేపు ఆటగాళ్లు రోడ్డుపైనే వేచి ఉండాల్సి వచ్చింది. అనంతరం మరో బస్సును ఏర్పాటు చేసి వారిని హోటల్‌కు తరలించారు. ఇప్పటికే ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఆ ఓటమి బాధ నుంచి బయటపడకముందే ఈ ఘటన జట్టును మరింత కలవరపరిచింది. గత కొన్ని రోజులుగా గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లు వరుస ప్రయాణాలతో బిజీగా ఉన్నారు. ధర్మశాల నుంచి ముల్లన్‌పూర్‌కు, అక్కడి నుంచి అహ్మదాబాద్‌కు ప్రయాణాలు చేయాల్సి వచ్చింది. వాతావరణ పరిస్థితుల కారణంగా వారి ప్రయాణ షెడ్యూల్ కూడా ఆలస్యమైంది. దీంతో జట్టుపై అలసట ప్రభావం కనిపించిందనే చర్చలు కూడా జరిగాయి. అయితే జట్టు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ విక్రమ్ సోలంకి మాత్రం అలసటను ఓటమికి కారణంగా చెప్పడానికి ఇష్టపడలేదు. ప్రత్యర్థి జట్టు అయితే జట్టు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ విక్రమ్ సోలంకి మాత్రం అలసటను ఓటమికి కారణంగా చెప్పడానికి ఇష్టపడలేదు. ప్రత్యర్థి జట్టు మెరుగైన ఆట ప్రదర్శించిందని ఆయన పేర్కొన్నారు. గుజరాత్ తక్కువ స్కోరు చేసినప్పటికీ బౌలర్లు చివరి వరకు పోరాడారని ఆయన అభిప్రాయపడ్డారు. ఏదేమైనా, ఫైనల్ ఓటమి తర్వాత జరిగిన ఈ బస్సు ప్రమాదం గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లు, అభిమానులను ఒక్కసారిగా ఆందోళనకు గురి చేసింది. కానీ అందరూ క్షేమంగా బయటపడటంతో పెద్ద ప్రమాదం తప్పినట్లైంది. ప్రస్తుతం ఈ ఘటనపై సంబంధిత అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. Also Read: RCB vs GT Highlights: ఐపీఎల్ 2026 ఛాంపియన్‌గా ఆర్సీబీ.. ఫైనల్ ఫైట్‌లో గుజరాత్ చిత్తు Also Read: RCB Winning Photos: వరుసగా రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడిన ఆర్సీబీ.. సెలబ్రేషన్ ఫోటోస్ వైరల్! స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్,...