
Peddi pre release event; మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా యాక్షన్ డ్రామా ‘పెద్ది’ థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమైంది. ఇప్పటికే విడుదలైన ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఆల్బమ్ బిగ్గెస్ట్ చాట్ బస్టర్‌గా నిలవగా, ఇటీవల వచ్చిన పవర్ఫుల్ ట్రైలర్ సినిమాపై అంచనాలను ఆకాశాన్ని తాకేలా చేసింది. దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ పూర్తి చేసుకున్న చిత్రబృందం, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున ప్రచారానికి ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా ‘పెద్ది’ గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్(Peddi pre release event)ను బెజవాడ నడిబొడ్డున నిర్వహించబోతున్నారు. Janhvi Kapoor: టాలీవుడ్ చాలా బెటర్.. దీపికాకు సాలిడ్ కౌంటర్ ఇచ్చిన జాన్వీ కపూర్ విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం వేదికగా ఈ భారీ వేడుకకు సర్వం సిద్ధమైంది. ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచే ఈ ఈవెంట్ ఎంతో వైభవంగా ప్రారంభం కానుంది. ఈ వేడుకలో పాల్గొనేందుకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, అందాల ముద్దుగుమ్మ జాన్వీ కపూర్, శివరాజ్ కుమార్, జగపతి బాబుతో పాటు చిత్రబృందం మొత్తం తరలివస్తోంది. ఈ మెగా ఈవెంట్ కోసం ఇప్పటికే విజయవాడ అంతటా మెగా అభిమానుల కోలాహలం నెలకొంది. పండుగ వాతావరణాన్ని తలపిస్తున్న ఈ వేడుక సినిమా విడుదలకు ముందు హైప్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఈ వేడుకకు మరింత ప్రత్యేక ఆకర్షణగా మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథులుగా హాజరు కానుండటం విశేషం. వీరితో పాటు మరికొందరు మెగా హీరోలు కూడా ఈ వేదికపై సందడి చేయబోతున్నారు. ఒకే వేదికపై మెగా బ్రదర్స్‌తో పాటు Telugu » Movies » Ram Charan Peddi Pre Release Event At Vijayawada అయితే ఈ వేడుకకు మరింత ప్రత్యేక ఆకర్షణగా మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథులుగా హాజరు కానుండటం విశేషం. వీరితో పాటు మరికొందరు మెగా హీరోలు కూడా ఈ వేదికపై సందడి చేయబోతున్నారు. ఒకే వేదికపై మెగా బ్రదర్స్‌తో పాటు రామ్ చరణ్‌ను చూడటానికి అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ సంయుక్తంగా నిర్మించిన ఈ భారీ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. 10TV is a Telugu News and Current Affairs Channel owned by Spoorthi Communications Private Limited. Launched in March 2013, 10TV primarily caters to the Telugu TV audience in Telangana and Andhra Pradesh, with a strong news network in both states. Copyright 2025 © Developed by Veegam Software Pvt Ltd. Peddi pre release event; మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా యాక్షన్ డ్రామా ‘పెద్ది’ థియేటర్లలో సందడి...