
అరుణ మహరాజు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. స్పోర్ట్స్, లైఫ్‌స్టైల్, హెల్త్, వినోదం, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Heart Health Tips: మన శరీరంలోని ముఖ్యమైన అవయవాలలో గుండె అతి ముఖ్యమైనది. గుండె ఆరోగ్యం బాగుండాలి అంటే లైఫ్‌స్టైల్, ఆహారం, వ్యాయామం చాలా అవసరం. ముఖ్యంగా రోజును ప్రారంభించే ఉదయాన్నే తీసుకునే ఆహారం గుండె ఆరోగ్యంలో చాలా ముఖ్యం. ఇది శరీరానికి మాత్రమే కాకుండా గుండెకు రక్షణ కూడా అందిస్తుంది. కాబట్టి, ఉదయాన్నే తీసుకోవటానికి గుండెకు ఎంతో మేలు చేసే 5 రకాల ఆహార పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1. వాల్నట్ లేదా బాదం ఈ రెండింటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ E, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండెకు చాలా ప్రయోజనకరం. ఉదయాన్నే 4 నుంచి 5 బాదం లేదా 2 నుంచి 3 వాల్నట్ తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. 2. ఓట్స్ ఓట్స్‌లో బీటా గ్లూకాన్ అనే ధాన్యం తంతువు ఉంటుంది. ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. వేడి పాలు లేదా నీటిలో ఓట్స్ ఉడికించి తింటే మంచి ఫలితాలు అందుతాయి. వాటిలో కొద్దిగా తేనె, డ్రై ఫ్రూట్స్ కూడా చేర్చుకోవచ్చు. 3. అవకాడో అవకాడోలో మోనోసాచ్యురేటెడ్ ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండెకు మంచి కొవ్వులుగా పనిచేస్తాయి. ఇందులో పొటాషియం, ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. బ్రెడ్ టోస్ట్‌లో వేసుకొని తినవచ్చు. స్మూతీగా లేదా సలాడ్‌గా కలిపి తీసుకోవచ్చు. 4. చిక్కుడు వర్గపు మొలకలు మొలకలలో ఉండే ప్రోటీన్, ఐరన్, ఫైబర్, మాగ్నీషియం, 4. చిక్కుడు వర్గపు మొలకలు మొలకలలో ఉండే ప్రోటీన్, ఐరన్, ఫైబర్, మాగ్నీషియం, పోటాషియం వంటివి హృదయ ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయి. మొలకలలో తేనె, నిమ్మరసం చల్లి తింటే మంచి ఫలితాలు అందుతాయి. ఉడికించి సలాడ్‌గా కూడా తినవచ్చు. 5. బేర్రీలు బ్లూబెర్రీలు, స్ట్రాబెర్రీలు, రాస్బెర్రీలు వంటి బేరీలు యాంటీ ఆక్సిడెంట్లు, పాలిఫినాల్స్ తో నిండివుంటాయి. ఇవి గుండె నాళాల్లో రక్తప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి. కాబట్టి వీటిని దోస, ఓట్స్, దహితో కలిపి తీసుకోవచ్చు. తాజా ఫ్రూట్ బౌల్లలో, సలాడ్స్‌లో కూడా కలిపి తినవచ్చు. Also Read: RCB Winning Photos: వరుసగా రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడిన ఆర్సీబీ.. సెలబ్రేషన్ ఫోటోస్ వైరల్! Also Read: AP Weather: ఇటు ఎండలు, అటు పిడుగుల వానలు.. ఈరోజు కూడా ఏపీలో ఇంతే.. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త! స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..