
Shubman Gill : రెండో సారి ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకోవాలనుకున్న గుజరాత్ టైటాన్స్ ఆశలు ఆవిరి అయ్యాయి. ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది. బ్యాటింగ్ వైఫల్యం, బౌలింగ్‌లో పవర్ ప్లేలో ధారాళంగా పరుగులు ఇవ్వడం, వికెట్లు తీయకపోవడంతోనే ఓడిపోయామని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తెలిపాడు. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో వాషింగ్టన్ సుందర్ (50 నాటౌట్; 37 బంతుల్లో 5 ఫోర్లు) అర్థశతకం బాదాడు. ఆర్సీబీ బౌలర్లలో రసిఖ్ సలాం దార్ మూడు, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. కృనాల్ పాండ్యా ఓ వికెట్ సాధించాడు. ఆ తరువాత 156 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ 18 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. బెంగళూరు బ్యాటర్లలో విరాట్ కోహ్లీ (75 నాటౌట్; 42 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్థశతకం చేయగా.. వెంకటేశ్ అయ్యర్ (32; 16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ రెండు, సిరాజ్, రబాడ, అర్షద్ ఖాన్ లు తలా వికెట్ తీశారు. Gujarat Titans : గుజరాత్ ప్లేయర్లకు తప్పిన పెను ప్రమాదం.. హోటల్‌కు వెలుతుండగా బస్సులో మంటలు.. ఇక మ్యాచ్ అనంతరం తమ జట్టు ఓటమిపై గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ స్పందించాడు. బ్యాటింగ్‌లో 180 నుంచి 190 పరుగులు చేసినా, బౌలింగ్‌లో పవర్ ప్లేలో 15 నుంచి 20 పరుగులు తక్కువగా ఇచ్చి ఉన్నా పరిస్థితి Telugu » Sports » Shubman Gill Key Comments After Gujarat Titans Lost Ipl 2026 Final Match Against Royal Challengers Bengaluru Shubman Gill key comments after Gujarat Titans lost IPL 2026 final match against Royal Challengers Bengaluru (pic credit@ipl) ఇక మ్యాచ్ అనంతరం తమ జట్టు ఓటమిపై గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ స్పందించాడు. బ్యాటింగ్‌లో 180 నుంచి 190 పరుగులు చేసినా, బౌలింగ్‌లో పవర్ ప్లేలో 15 నుంచి 20 పరుగులు తక్కువగా ఇచ్చి ఉన్నా పరిస్థితి మరో రకంగా ఉండేదన్నాడు. ఈ మ్యాచ్‌లో మేం 180 నుంచి 190 పరుగులు చేసి ఉంటే మ్యాచ్ ఉత్కంఠగా మారేదని అనుకుంటున్నాను. నిజం చెప్పాలంటే ఈ పిచ్ మరీ అంత స్లోగా ఏమీ లేదు. కొంచెం ఉండొచ్చు. తొలి నాలుగు ఓవర్లలో పేసర్లు స్వింగ్‌ను రాబట్టారు. ఆరంభంలోనే మేము వికెట్లు కోల్పోయాం. దీంతో మిడిల్ ఓవర్లలో మూమెంటాన్ని మిస్ అయ్యాం. అందుకనే ఆశించిన స్కోరును అందుకోలేకపోయాము. అని గిల్ అన్నాడు. ఫైనల్ మ్యాచ్ ఆడుతున్నామనే విషయం తమకి తెలుసు అని అన్నాడు. 150-160 పరుగులు చేసినప్పటికి కూడా పవర్ ప్లేలోనే రెండు వికెట్లు తీసి ఉంటే మ్యాచ్ పై పట్టు దక్కేదన్నాడు. అయితే.. తమ బౌలర్లు పవర్ ప్లేలో వికెట్లు తీయలేకపోయారని, అదే సమయంలో ఆర్సీబీ బ్యాటర్లు పవర్ ప్లేలో 15-20 పరుగులు ఎక్కువగా చేసి మ్యాచ్‌ను తమ నుంచి లాగేసుకున్నారన్నాడు. కప్పు గెలవకపోయినప్పటికి ఈ సీజన్లో ఎన్నో సానుకూల అంశాలు ఉన్నాయని గిల్ చెప్పాడు. ఈ టోర్నీలో అత్యుత్తమ బౌలింగ్ దళాల్లో తమది ఒకటి అని అన్నాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన తరువాత తాము పుంజుకున్న తీరు అద్భుతం అని చెప్పుకొచ్చాడు. Virat Kohli : నా కల నెరవేరింది.. ఈ క్షణం కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూశా.. ఆ సిక్స్ కొట్టినప్పుడు.. కోహ్లీ కామెంట్స్.. తాము తప్పిదాల నుంచి నిరంతరం నేర్చుకుంటూనే ఉంటామని, తాము మెరుగుపరచుకోవాల్సిన అంశాలు ఇంకా చాలానే ఉన్నాయన్నాడు. ఓడిపోయామని ఈ విషయం చెప్పడం లేదని, గెలిచినా కూడా ఇదే విషయాన్ని చెప్పేవాడినని అన్నాడు. ఏదీఏమైనప్పటికి కూడా ఈ టోర్నీలో తమ జట్టు ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నానని గిల్ తెలిపాడు. 10TV is a Telugu News and Current Affairs Channel owned by Spoorthi Communications Private Limited. Launched in March 2013, 10TV primarily caters to the Telugu TV audience in Telangana and Andhra Pradesh, with a strong news network in both states. Copyright 2025 © Developed by Veegam Software Pvt Ltd. Shubman Gill : రెండో సారి ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకోవాలనుకున్న గుజరాత్ టైటాన్స్ ఆశలు ఆవిరి అయ్యాయి. ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్...