
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 సీజన్లో హాట్ టాపిక్ వైభవ్ సూర్యవంశీ. ఈ ఎడిషన్‌లో తన జట్టు రాజస్థాన్ రాయల్స్ రెండో క్వాలిఫయర్‌లో ఓడి ఇంటిముఖం పట్టినా.. అతడు మాత్రం తన ఆటతో దుమ్మురేపాడు. అత్యధిక పరుగులు (776) చేసి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. దీంతోపాటు మరి కొన్ని అవార్డులను దక్కించుకున్నాడు. ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్, సూపర్ స్ట్రయిక్‌రేట్ (237.3), సూపర్ సిక్సర్ల (72) అవార్డులు వరించాయి. ఫైనల్ మ్యాచ్ అనంతరం వాటిని స్వీకరించిన వైభవ్.. ఈ టోర్నీలో తన అనుభవాలను పంచుకున్నాడు. ‘‘అవార్డులు వచ్చినందుకు ఆనందంగా ఉన్నా.. ఇలా ఇంటర్వ్యూలో మాట్లాడాలంటే కాస్త ఒత్తిడిగా అనిపిస్తోంది. నాకు ఇది గర్వపడే క్షణం. వచ్చే సీజన్లో మరింత మెరుగ్గా ఆడేందుకు ప్రయత్నిస్తా. (నిర్భయంగా ఆడేందుకు రోజుకు ఎన్ని గ్లాస్‌ల పాలు తాగుతావు? అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ) సార్.. నేను ఇవాళ పాలు తాగలేదు (నవ్వుతూ). ఆట కోసం ప్రత్యేకంగా ఏమీ చేయను. సహజసిద్ధంగా ఆడేందుకు ప్రయత్నించా. తొలి బంతి నా జోన్లో పడితే భారీ షాట్ కొట్టేందుకే చూస్తా. ఒక్కసారి కనెక్ట్ అయితే అదే దూకుడుతో ఆడతా. నేను ఈ సీజన్లో ఓ కీలక విషయం నేర్చుకున్నా. ఒత్తిడి సమయంలో ఎలా ఆడాలనేది తెలుసుకున్నా. అలాగే పరిస్థితికి తగ్గట్టుగా జట్టుకు ఏది అవసరమో తెలుసుకుని ఆడా. నాకౌట్ స్టేజ్‌లోనూ అది చేసి చూపించా. ఫిట్నెస్పైనా దృష్టి పెట్టా. సుదీర్ఘకాలం పాటు ఆడాలంటే అదెంతో కీలకం. గాయాలు కాకుండా చూసుకోవాలి. మా జట్టులోని ప్రతి ఒక్కరూ చాలా సపోర్టివ్‌గా ఉంటారు. వారంతా అంతర్జాతీయ స్థాయిలో ఆడిన అనుభవం ఉన్న ఆటగాళ్లు. జట్టులో చాలా మంచి వాతావరణం ఉంది’’ అని వైభవ్ తెలిపాడు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. ఐపీఎల్-19 ఫైనల్లో విరాట్ కోహ్లీ సూపర్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. అర్షద్ ఖాన్ వేసిన ఇన్సింగ్స్ 16వ ఓవర్ చివరి బంతికి విరాట్ భారీ షాట్‌కు ప్రయత్నించగా.. శుభ్‌మన్ గిల్ డైవ్ చేసి క్యాచ్ అందుకున్నాడు. విరాట్ కోహ్లీ మరోసారి అద్భుత ప్రదర్శన చేశాడు. ఐపీఎల్-19 ఫైనల్లో సూపర్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. విజయానికి ఒక్క పరుగు దూరంలో ఉండగా విరాట్ కోహ్లీ అద్భుతమైన సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాడు. విన్నింగ్ షాట్ వీడియో మీరూ చూడండి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) ఐపీఎల్(IPL) టైటిల్‌ను వరుసగా రెండోసారి సొంతం చేసుకుంది. For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in © 1999 - 2026 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved. Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted. This website follows the DNPA Code of Ethics. ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 సీజన్లో హాట్ టాపిక్ వైభవ్ సూర్యవంశీ. ఈ ఎడిషన్‌లో తన జట్టు రాజస్థాన్ రాయల్స్ రెండో క్వాలిఫయర్‌లో ఓడి ఇంటిముఖం పట్టినా.. అతడు మాత్రం తన ఆటతో...