
ఇంటర్నెట్ డెస్క్: వరుసగా రెండోసారి ఐపీఎల్ కప్పును నెగ్గిన మూడో జట్టుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. విరాట్ కోహ్లీతోపాటు ఆ జట్టు సారథి రజత్ పాటీదార్ కూడా కీలక పాత్ర పోషించాడు. గుజరాత్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో టాస్ నెగ్గిన ఆర్సీబీ బౌలింగ్ ఎంచుకుంది. నాకౌట్ స్టేజ్‌లోని గత మూడు మ్యాచుల్లో టాస్ గెలిచిన టీమ్ తొలుత బ్యాటింగ్ తీసుకుంది. అందుకు భిన్నంగా ఆర్సీబీ లక్ష్య ఛేదన వైపే మొగ్గుచూపడం గమనార్హం. దీనిపై బెంగళూరు కెప్టెన్ రజత్ పాటీదార్ స్పష్టత ఇచ్చాడు. అలాగే ఈ విజయాన్ని వారి అభిమానులకే మళ్లీ అంకితం చేస్తున్నట్లు ప్రకటించాడు. ‘‘వరుసగా రెండో కప్పును సొంతం చేసుకోవడం ఆనందంగా ఉంది. ఫైనల్ కోసం ఇక్కడికి వచ్చాక గతేడాది జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి. అప్పుడు ఎలా ఆడామో.. ఇప్పుడు కూడా అదే దూకుడు ప్రదర్శించాం. ఈ విజయంపై ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు. టాస్ గెలిస్తే ఏం చేయాలనే దానిపై పూర్తి స్పష్టతతో ఉన్నాం. మా ప్లాన్ ప్రకారమే నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇక్కడ లక్ష్య ఛేదన సులువుగానే ఉంటుందని భావించాం. అందుకే, టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్నాం. గుజరాత్ టాప్ - 3 బ్యాటర్లను త్వరగా ఔట్ చేస్తే మ్యాచ్ మా నియంత్రణలోకి వస్తుందని తెలుసు. భువీ, జోష్, రసిఖ్ ఈ సీజన్లో చాలా ప్రభావం చూపించిన బౌలర్లు. జట్టులోని ప్రతి బౌలర్‌ను నేను మెన్షన్ చేయాలి. కెప్టెన్‌గా ఇక్కడ నా ప్రయాణం అద్భుతం. వరుసగా రెండోసారి కప్పును సగర్వంగా ఎత్తుకోవడం మరిచిపోలేని సందర్భం. గతేడాది మాపై తీవ్ర ఒత్తిడి ఉండేది. కానీ, ఈసారి అంచనాలు ఉన్నాసరే ఒత్తిడి లేకపోవడంతో స్వేచ్ఛగా ఆడాం’’ అని పాటీదార్ తెలిపాడు. ‘‘ఈ ‘‘ఈ సీజన్లో ప్రతి ఒక్కరూ మంచి ఫామ్‌లో ఉండటం కలిసొచ్చింది. తొలి మ్యాచ్ నుంచే దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించాం. ప్రి సీజన్ ప్రాక్టీస్ సెషన్స్‌లోనూ చాలా శ్రమించాం. విరాట్, డీకే నుంచి చాలా ఇన్‌ఫుట్స్ తీసుకున్నా. నన్ను నేను మెరుగుపర్చుకున్నా. జట్టుపై విరాట్ కోహ్లీ ప్రభావం అత్యంత కీలకం. మైదానంలో చాలా చురుగ్గా ఉంటూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటాడు. కొత్త ఆటగాళ్లు మొదట్లో మాట్లాడేందుకు ఇబ్బంది పడేవారు. కానీ, కోహ్లీ మాత్రం నేరుగా వారితో మాట్లాడి ధైర్యం చెప్పాడు. మేం ఎక్కడికి వెళ్లినా అభిమానులు పెద్ద ఎత్తున వచ్చి ప్రోత్సహించారు. వారి కోసం ఏం చేసినా తక్కువే. ఈ సలా కప్ నమ్దు. ఈసారి కప్పును కూడా వారికే అంకితం చేస్తున్నాం’’ అని పాటీదార్ వ్యాఖ్యానించాడు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. ఐపీఎల్-19 ఫైనల్లో విరాట్ కోహ్లీ సూపర్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. అర్షద్ ఖాన్ వేసిన ఇన్సింగ్స్ 16వ ఓవర్ చివరి బంతికి విరాట్ భారీ షాట్‌కు ప్రయత్నించగా.. శుభ్‌మన్ గిల్ డైవ్ చేసి క్యాచ్ అందుకున్నాడు. విరాట్ కోహ్లీ మరోసారి అద్భుత ప్రదర్శన చేశాడు. ఐపీఎల్-19 ఫైనల్లో సూపర్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. విజయానికి ఒక్క పరుగు దూరంలో ఉండగా విరాట్ కోహ్లీ అద్భుతమైన సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాడు. విన్నింగ్ షాట్ వీడియో మీరూ చూడండి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) ఐపీఎల్(IPL) టైటిల్‌ను వరుసగా రెండోసారి సొంతం చేసుకుంది. For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in © 1999 - 2026 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved. Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted. This website follows the DNPA Code of Ethics. ఇంటర్నెట్ డెస్క్: వరుసగా రెండోసారి ఐపీఎల్ కప్పును నెగ్గిన మూడో జట్టుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. విరాట్ కోహ్లీతోపాటు ఆ జట్టు సారథి రజత్ పాటీదార్ కూడా కీలక పాత్ర...