
ఐపీఎల్ 2026 మహా సంగ్రామంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మరోసారి విశ్వవిజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ పోరులో గుజరాత్ టైటాన్స్‌ను ఐదు వికెట్ల తేడాతో మట్టికరిపించి, రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. కోహ్లీ సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించడంతో మైదానమంతా ఆర్సీబీ నినాదాలతో హోరెత్తిపోయింది. ఆర్సీబీ విజయకేతనం.. గుజరాత్ ఆశలు గల్లంతు.. టాస్ ఓడిపోవడంతోనే గుజరాత్ టైటాన్స్ సగం మ్యాచ్‌ను చేజార్చుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టును ఆర్సీబీ బౌలర్లు కట్టడి చేశారు. ఓపెనర్లు సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ ఇద్దరూ 20 పరుగుల లోపే పెవిలియన్ చేరడం ఆ జట్టును కోలుకోలేని దెబ్బతీసింది. మిడిల్ ఆర్డర్ సైతం చేతులెత్తేయడంతో గుజరాత్ నిర్ణీత ఓవర్లలో 156 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించగలిగింది. ఈ చిన్న స్కోరును ఆర్సీబీ 18 ఓవర్లలోనే ఐదు వికెట్లు కోల్పోయి ఊదేశింది. అయితే, ఈ ఫైనల్ మ్యాచ్ కేవలం ఆట పరంగానే కాకుండా, మైదానంలో జరిగిన ఐదు వింతలు, ఆసక్తికర సంఘటనలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. 1. ఆశిష్ నెహ్రా నిర్లక్ష్యం.. గిల్ టెన్షన్! సాధారణంగా ప్రతి మ్యాచ్‌లోనూ బౌండరీ లైన్ వద్ద నిలబడి ఆటగాళ్లను ఎంతో యాక్టివ్‌గా నడిపించే గుజరాత్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా, ఈ కీలక ఫైనల్లో మాత్రం పూర్తి భిన్నంగా కనిపించాడు. జట్టు ఓటమి అంచున ఉన్నా ఎలాంటి సలహాలు ఇవ్వకుండా, డగౌట్లో కూర్చుని నెయిల్ కట్టర్‌తో ప్రశాంతంగా కాళ్ల గోళ్లు తీసుకుంటూ కెమెరాకు చిక్కాడు. మరోవైపు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తీవ్రమైన ఒత్తిడితో మైదానంలోనే చేతి గోళ్లు కొరుక్కుంటూ కనిపించాడు. గురువు నిర్లక్ష్యం, శిష్యుడి టెన్షన్‌కు సంబంధించిన ఈ విజువల్స్ నెట్టింట విపరీతంగా ట్రోల్ అవుతున్నాయి. 2. కోహ్లీతో సాయి సుదర్శన్ స్లెడ్జింగ్.. pic.twitter.com/ZJ3Y94AttC — crictalk (@crictalk7) May 31, 2026 బెంగళూరు ఇన్నింగ్స్ చేజింగ్ సమయంలో ఒక ఆసక్తికరమైన హైడ్రామా నడిచింది. ఆర్సీబీ నాలుగు వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో ఉన్నప్పుడు, క్రీజులో ఉన్న విరాట్ కోహ్లీని మానసికంగా దెబ్బతీయాలని గుజరాత్ ప్లాన్ చేసింది. కెప్టెన్ గిల్ సూచనతో సాయి సుదర్శన్ కోహ్లీ వద్దకు వెళ్లి గొడవకు దిగాడు. "నువ్వు ఒక్కసారి అవుటై చూడు, మ్యాచ్ మొత్తం మా చేతుల్లోకి వస్తుంది" అంటూ స్లెడ్జింగ్‌కు దిగాడు. అయితే కోహ్లీ ఎంతో సంయమనంతో నవ్వుతూ.. "నేనేం అవుట్ కాను, చివరి వరకు ఉండి మ్యాచ్ గెలిపిస్తా" అని బదులిచ్చాడు. అన్నట్లుగానే కింగ్ కోహ్లీ అజేయంగా నిలిచి జట్టును విజేతగా నిలిపాడు. 3. జై షా పక్కన 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ! VAIBHAV SOORYAVANSHI WITH ICC PRESIDENT JAI SHAH WATCHING IPL FINAL GT VS RCB. #RCBvsGT #GTvsRCB #ViratKohli #ShubmanGill #VaibhavSooryavanshi pic.twitter.com/pCu4O365ot — Somesh Jangra (@CelebrityGalax) May 31, 2026 ఈ ఫైనల్ మ్యాచ్‌లో అందరి దృష్టిని ఆకర్షించిన మరో దృశ్యం విఐపి స్టాండ్స్‌లో కనిపించింది. ఐసీసీ బాస్ జై షా పక్కన కూర్చుని 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మ్యాచ్‌ను వీక్షించాడు. ఈ సీజన్లో ఏకంగా 776 పరుగులు సాధించి 'ఆరెంజ్ క్యాప్' కైవసం చేసుకున్న వైభవ్, ఆ అవార్డును అందుకోవడానికి ఫైనల్ మ్యాచ్‌కు హాజరయ్యాడు. జై షాతో కలిసి అతడు దిగిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. 4. నో-అవుట్ వివాదం.. పాత మ్యాచ్ సెగలు.. Gone... gone... DROPPED! 😱🤯 Big moment in the match as #WashingtonSundar is dropped in the deep by #JordanCox. 👀#TATAIPL 2026 FINAL | #RCBvGT | LIVE NOW 👉 https://t.co/nTKb3Qmpst pic.twitter.com/xUznFU4TBU — Star Sports (@StarSportsIndia) May 31, 2026 గుజరాత్ బ్యాటింగ్ సమయంలో జాకబ్ డఫీ వేసిన 10వ ఓవర్ చివరి బంతికి వాషింగ్టన్ సుందర్ ఫైన్ లెగ్ మీదుగా భారీ షాట్ ఆడాడు. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న జోర్డన్ క్రాక్స్ గాల్లోకి దూకుతూ అద్భుతమైన డైవ్‌తో క్యాచ్ అందుకున్నాడు. అయితే బంతి నేలకు తాకినట్లు రీప్లేలో స్పష్టమవడంతో థర్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. ఇదే గ్రౌండ్లో గతంలో రజత్ పాటిదార్ క్యాచ్‌ను జేసన్ హోల్డర్ ఇలాగే పట్టినప్పుడు అవుట్ ఇచ్చారని, ఇప్పుడు సుందర్‌కు ఎందుకు ఇవ్వలేదంటూ పాత నిర్ణయాలను గుర్తు చేస్తూ అభిమానులు అంపైరింగ్ ప్రమాణాలపై మండిపడుతున్నారు. 5. గిల్ పట్టిన క్యాచ్.. థర్డ్ అంపైర్ ట్విస్ట్! विराट भाई इतना भी यार,,,,,, रॉयल चैलेंजर बैंगलोर का टीम वर्क था और एक तरफ गुजरात को हर बार दो खिलाड़ी एक साईं और दूसरा #ShubmanGill जो फाइनल तक लेकर चले जाते हैं ❣️🙌 गिल भाई दिल छोटा ना कर