
Rashmika Shares Japan Trip With Vijay Devarakonda Photos: ఇటీవల జపాన్లో జరిగిన యానిమే అవార్డ్స్ వేడుకకు హీరోయిన్ రష్మిక మందన్న హాజరైన విషయం తెలిసిందే. టోక్యోలో జరిగిన ఈ అవార్డుల కార్యక్రమానికి సంబంధించిన కొన్ని ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో తాజాగా షేర్ చేశారు. అయితే, తన జపాన్ డైరీకి సంబంధించి హీరో విజయ్ దేవరకొండతో ఉన్న ఫోటోలను కూడా ఆమె పంచుకుని అభిమానులకు ఒక పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు. టోక్యోలో జరిగిన యానిమే అవార్డు ఫంక్షన్లకు రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ కలిసి వెళ్లినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన కొత్త ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నటి తన భర్త విజయ్ దేవరకొండతో దిగిన చిత్రాలను అభిమానులకు షేర్ చేశారు. ఈ ఏడాది జపాన్ పర్యటన చాలా సరదాగా గడిచిందని రష్మిక తన క్యాప్షన్ లో రాశారు. రష్మిక తన భర్త విజయ్ దేవరకొండతో కలిసి జపాన్ వీధుల్లో తిరుగుతున్న ఫోటోలను పంచుకోవడమే కాకుండా, అక్కడి సాంప్రదాయ దుస్తుల్లో కూడా కనిపించారు. అంతేకాకుండా అక్కడి వంటకాలను కూడా ఆమె ఆస్వాదించారు. ఒక ఫోటోలో రష్మిక గ్రీన్ ఆకులతో, నారింజ, పసుపు రంగు సన్ఫ్లవర్ డిజైన్ ఉన్న సాంప్రదాయ జపనీస్ యూకాట డ్రెస్ లో ఎంతో అందంగా కనిపిస్తున్నారు. రష్మిక పంచుకున్న ఈ చిత్రాల ద్వారా ఆమె ఒంటరిగా జపాన్ టూర్ చేయలేదని, విజయ్ దేవరకొండతో కలిసి పర్యటించినట్లు స్పష్టమవుతోంది. ఆమె కొన్ని అస్పష్టమైన వీడీ ఫోటోలను కూడా షేర్ చేయడంతో, ఈ జంట కలిసి జపాన్ వెళ్లారని అందరికీ అర్థమైంది. ఉదయపూర్ వేదికగా రష్మిక, విజయ్ దేవరకొండల వివాహం ఫిబ్రవరి 26న జరిగింది. ఆ తర్వాత హైదరాబాద్లోని ఉదయపూర్ వేదికగా రష్మిక, విజయ్ దేవరకొండల వివాహం ఫిబ్రవరి 26న జరిగింది. ఆ తర్వాత హైదరాబాద్లోని తాజ్ హోటల్లో వారి రిసెప్షన్ వేడుకను నిర్వహించారు. చాలా కాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట, రహస్యంగా డేటింగ్ చేస్తూ చివరకు ఈ ఏడాది వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరి రిసెప్షన్ వేడుకకు అల్లు అర్జున్, చిరంజీవి, రామ్ చరణ్, కరణ్ జోహార్, కృతి సనన్ వంటి ప్రముఖులు హాజరయ్యారు. విజయ్ దేవరకొండ, రష్మిక మొదట 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' సినిమాల్లో కలిసి నటించారు. అప్పటి నుండి వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారనే పుకార్లు సోషల్ మీడియాలో వస్తూ ఉండేవి. వీరు కలిసి విహారయాత్రలకు వెళ్తూ, తమ ఫోటోలను అస్పష్టంగా షేర్ చేస్తూ ఉండేవారు. వీళ్ల పెళ్లి అయ్యే వరకు కూడా అధికారికంగా ఇద్దరూ ఏ విషయం ప్రకటించలేదు. విజయ్ దేవరకొండ, రష్మిక జంట పెళ్లయిన తర్వాత 'రణబలి' అనే సినిమాలో విడుదల కాబోతుంది. ఈ సినిమాకు రాహుల్ సాంకృత్యం దర్శకత్వం వహిస్తున్నారు. 1854 నుండి 1875 మధ్య కాలంలో జరిగిన ఒక కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇక విజయ్ రష్మికలు నటించిన రణబలి సినిమా సెప్టెంబర్ 11న విడుదల కానుంది. విజయ్ దేవరకొండ నటించిన ఇతర చిత్రాల షూటింగ్ కూడా జరుగుతోంది. రష్మిక తాజాగా కాక్ టెయిల్ 2, మైసా చిత్రాలు విడుదల కాబోతున్నాయి. Rashmika Shares Japan Trip With Vijay Devarakonda Photos: ఇటీవల జపాన్లో జరిగిన యానిమే అవార్డ్స్ వేడుకకు హీరోయిన్ రష్మిక మందన్న హాజరైన విషయం తెలిసిందే. టోక్యోలో జరిగిన ఈ అవార్డుల...