
Virat Kohli : ఐపీఎల్ 2026 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి ఆర్సీబీ వరుసగా రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో వాషింగ్టన్ సుందర్ (37 బంతుల్లో 50 నాటౌట్) అర్ధశతకం చేశాడు. ఆర్సీబీ బౌలర్లలో రసిఖ్ సలాం దార్ మూడు, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్ చెరో రెండు వికెట్లు తీశాడు. కృనాల్ పాండ్యా ఓ వికెట్ పడగొట్టాడు. IPL 2026 : ఆర్సీబీకి 20 కోట్లు ఇచ్చారు.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మరీ ఇంత తక్కువ ఇచ్చారేంట్రా.. ఆ తరువాత 156 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ 18 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లీ (75 నాటౌట్; 42 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేశాడు. వెంకటేశ్ అయ్యర్ (16 బంతుల్లో 32 పరుగులు) రాణించాడు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ రెండు, సిరాజ్, రబాడ, అర్షద్ ఖాన్ లు తలా వికెట్ పడగొట్టారు. ఐపీఎల్లో రెండోసారి విజయం సాధించిన తరువాత ఆర్సీబీ ఆటగాళ్ల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక ఆర్సీబీ జట్టు సోషల్ మీడియాలో ఓ వీడియోను పంచుకుంది. ఇందులో విరాట్ కోహ్లీ.. తన భార్య అనుష్క శర్మ, బ్యాటింగ్ కోచ్ దినేశ్ కార్తీక్‌తో పాటు ఇతర జట్టులోని పలువురు ఆటగాళ్లతో కలిసి ఆనందంగా డ్యాన్స్ చేస్తూ కనిపించాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Shubman Gill : ఓడిపోయామని Telugu » Sports » Ipl 2026 Title Win Rcb Virat Kohli And Anushka Sharma Burn The Dance Floor Shubman Gill : ఓడిపోయామని ఈ విషయం చెప్పడం లేదు.. గెలిచినా కూడా ఇదే చెప్పేవాడిని.. శుభ్‌మన్ గిల్ హాట్ కామెంట్లు 𝗞𝗶𝗻𝗴 𝗞𝗼𝗵𝗹𝗶’𝘀 𝗺𝗮𝘀𝘁𝗲𝗿𝗰𝗹𝗮𝘀𝘀 𝗼𝗻 𝘁𝗵𝗲 𝗱𝗮𝗻𝗰𝗲 𝗳𝗹𝗼𝗼𝗿 😉 Pure vibes. Wholesome. And so much more. Anushka Sharma, thank you for being our Day 1. ❤️ pic.twitter.com/7Qmxxv6QtG — Royal Challengers Bengaluru (@RCBTweets) June 1, 2026 10TV is a Telugu News and Current Affairs Channel owned by Spoorthi Communications Private Limited. Launched in March 2013, 10TV primarily caters to the Telugu TV audience in Telangana and Andhra Pradesh, with a strong news network in both states. Copyright 2025 © Developed by Veegam Software Pvt Ltd. Virat Kohli : ఐపీఎల్ 2026 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి...