ఇంటర్నెట్ డెస్క్: మహిళ పెద్ద కర్మ రోజు ఆమె కుటుంబసభ్యులు ముజ్రా డ్యాన్స్ ఏర్పాటు చేసిన ఘటన బిహార్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళితే.. బెగుసరై జిల్లాకు చెందిన మైనా దేవి అలియాస్ జాన్‌కి దేవి మే 19వ తేదీన చనిపోయింది. మే 30వ తేదీన పెద్ద కర్మ జరిగింది. సాధారణంగా పెద్ద కర్మ రోజు ఆ ప్రాంతంలో భజనలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంటారు. కానీ, మైనా దేవి కొడుకు మహారాణా ప్రతాప్ పాశ్వాన్ మాత్రం పాడు పనికి తెరతీశాడు. తల్లి పెద్ద కర్మ రోజు రాత్రి ముజ్రా డ్యాన్స్ ఏర్పాటు చేశాడు.

రాత్రి మొదలైన ముజ్రా డ్యాన్స్ కార్యక్రమం ఉదయం వరకు కొనసాగింది. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ వీడియోలపై స్పందిస్తున్న నెటిజన్లు మైనా దేవి కుటుంబసభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక, ఈ సంఘటనపై స్థానికులు మాట్లాడుతూ.. ‘మైనా దేవికి నివాళులు అర్పించడం కోసం జనం అక్కడికి వచ్చారు. కుటుంబసభ్యులు నివాళులు అర్పించే కార్యక్రమాన్ని పెళ్లి వేడుకలా.. ఆర్కెస్ట్రాలాగా మార్చేశారు. కొంతమంది జనం డ్యాన్స్ చూస్తుంటే.. మరికొంతమంది స్టేజి మీదకు ఎక్కి డ్యాన్స్‌లు చేశారు’ అని తెలిపారు.

ఇవి కూడా చదవండి

పింఛన్లను రూ.4వేలకు పెంచిన ఘనత చంద్రబాబుదే: ఎమ్మెల్సీ అనురాధ..

పారదర్శకంగా పింఛన్లు పంపిణీ చేస్తున్నాం: ఎమ్మెల్యే వసంత

ఇంటర్నెట్ డెస్క్: మహిళ పెద్ద కర్మ రోజు ఆమె కుటుంబసభ్యులు ముజ్రా డ్యాన్స్ ఏర్పాటు చేసిన ఘటన బిహార్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళితే.. బెగుసరై...